చంద్రబాబు, సోమిరెడ్డిలకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్, విద్యార్థులకు సూచన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ధన్యవాదులు తెలిపారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ధన్యవాదులు తెలిపారు.
చదవండి: నేనేం బంగారం కాదు, చంపేసే సహనం వద్దు, కొట్టమని అర్థమా: పవన్ కళ్యాణ్
తమ పాలిట శాపంగా మారిందంటూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు జీవో నెంబరు 64పై నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ మధ్యే వారు పవన్ కళ్యాణ్‌ని వారు కలిశారు.

తమ సమస్యలను జనసేనానికి విన్నవించుకున్నారు. దీనిపై పునరాలోచన చేయాలని పవన్ చెప్పారు. అనంతరం ఈ జీవోపై పునరాలోచించిన ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 64ను రద్దు చేసింది.
దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. జీవో నెంబరు 64ను రద్దు చేసినందుకు సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. అలాగే, వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు సేవ చేయడం పట్ల పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు.
#JanaSena pic.twitter.com/e9CIjGyyRx
— Pawan Kalyan (@PawanKalyan) September 6, 2017
# Janasena pic.twitter.com/RgsWwF8BdQ
— Pawan Kalyan (@PawanKalyan) September 6, 2017












Click it and Unblock the Notifications