టీడీపీపై పట్టు బిగిస్తున్న పవన్ - నారా, నందమూరి ఫ్యామిలీకి "హీరో"...!!

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ,జనసేన పొత్తు అధికారికం అయింది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సొంత పార్టీ నేతల కంటే జనసేనాని అండగా నిలిచారు. చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు. దీంతో, ఒక్కసారిగా టీడీపీలో పవన్ పట్టు పెరిగింది. నారా - నందమూరి కుటుంబం లో పవన్ కు ఆమోదం దక్కింది.

చంద్రబాబు కష్టాల వేళ : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీ నేతలు..కార్యకర్తలకు షాక్ గా మారింది. పార్టీని నడిపించే నేతే జైలు పాలు కావటంతో నేతలు అయోమయంలో పడ్డారు. చంద్రబాబు అరెస్ట్ తో పార్టీలో సీనియర్లు సరైన రీతిలో స్పందించలేదు. నంద్యాల నుంచి తాడేపల్లి వరకు రోడ్డు మార్గంలో చంద్రబాబును తీసుకొచ్చారు. తరువాత విజయవాడ కోర్టులో రోజంతా ఉన్నారు.

Pawan Kalyan the saviour for Chandrababu and TDP- A peek into what is between Janasena and TDP

అయినా ఆ సమయంలోనూ టీడీపీ నేతలే సరైన రీతిలో స్పందించలేదనే ఆడియోలు బయటకు వచ్చాయి. అయితే, చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన పవన్ కల్యాణ్, తాను బీజేపీతో పొత్తులో ఉన్నా టీడీపీ బంద్ కు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత ఏకంగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిసారు. పొత్తు నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అండగా నిలిచిని పవన్ : చంద్రబాబు అరెస్ట్ సమయంలో నారా, నందమూరి కుటుంబానికి ఒక విధంగా పవన్ కల్యాణ్ ఆప్తుడిగా మద్దతుగా నిలిచారనే అభిప్రాయం ఉంది. పవన్ కష్టాల్లో ఉన్న సమయంలో చంద్రబాబు స్పందిస్తారో లేదో కానీ, పవన్ ఇప్పుడు స్పందించిన తీరుకు నారా - నందమూరి కుటుంబ సభ్యుల నుంచి ఒక్కసారిగా ఆదరణ పెరిగింది.

సొంత పార్టీలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వారు..ప్రయోజనాలు అందుకున్న వారి కంటే మరో రాజకీయ పార్టీ నేతగా పవన్ ముందుకు వచ్చిన విధానం పైన ఇప్పుడు జనసేన కంటే టీడీపీలో ఎక్కువగా చర్చ సాగుతోంది. టీడీపీ సీనియర్లు సరైన రీతిలో స్పందించకపోవటం పైన పార్టీ కేడర్ లోనే వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే సమయంలో పవన్ పైన అభిమానం కనిపిస్తోంది.

Pawan Kalyan the saviour for Chandrababu and TDP- A peek into what is between Janasena and TDP

నారా ఫ్యామిలీకి మద్దతు : ఇక, రాజకీయ పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. బీజేపీ సంగతి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు పవన్ తో సీట్లు..లెక్కల తోనే చర్చలు జరిగాయి. కానీ, ఇప్పుడు సరైన సమయంలో పవన్ మొత్తం సీన్ తనకు అనుకూలగా మలచుకోవటంలో తొలి అడుగులో సక్సెస్ అయ్యారు.

పవన్ కోరుకున్న విధంగా సీట్ల నుంచి పవర్ షేరింగ్ వరకు ఏదీ కాదనలేని విధంగా నారా - నందమూరి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించేలా అభిమానం దక్కించుకున్నారు. దీంతో, ఎన్నికల సమయంలోనూ పవన్ పట్టు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇది టీడీపీలోని కొందరికి నచ్చకపోయినా..తాజా పరిణామాలతో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరుతో ఆ పట్టు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+