పవన్ కీలక నిర్ణయం - సీన్ మార్చేస్తారా, వారి పైనే నమ్మకం..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. అన్ని పార్టీలు ప్రచారంలోకి దిగాయి. పొత్తు లెక్కల్లో జనసేన 21 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తోంది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రస్తుత రాజకీయ పరిణామాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్ ఈ సారి పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో, ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురానికి పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ తన పార్టీ నుంచి ఇప్పటికే 18 మంది అభ్యర్దులను ప్రకటించారు. మరో ముగ్గురిని ప్రకటించాల్సి ఉంది. పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతున్నారు. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ అభ్యర్దుల పైన నిర్ణయానికి వచ్చినా, అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ సమయంలో ఎన్నికల ప్రచారానికి పవన్ సిద్దమవుతున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే పోటీ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఈ నెల 30వ తేదీ నుంచి పవన్ పిఠాపురం పర్యటన ఖరారైంది. 30వ తేదీన పిఠాపురంలో పార్టీ నియోజకవర్గ సమీక్ష చేపట్టనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు. నియోజకవర్గంలో తన లక్ష్యాలను వివరించనున్నారు.

వారాహి ద్వారా ప్రచారం
ఈ నెల 31న ఉప్పాడ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. వారాహి ద్వారా సభలో పాల్గొంటారు. తన ఎన్నికల ప్రచారం ఈ సభ ద్వారానే ప్రారంభం కానుంది. మరుసటి రోజున ఏప్రిల్ 1న పిఠాపురం నియోజకవర్గంలోని మేధావులతో పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే టీడీపీ పిఠాపురం ఇంఛార్జ్ వర్మ ప్రత్యేకంగా పవన్ తో సమావేశమయ్యారు. చంద్రబాబు సూచన మేరకు పవన్ విజయానికి సహకారం అందిస్తానని ప్రకటించారు. నియోజకవర్గాలోని సామాజిక సమీకరణాల ఆధారంగా వైసీపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. వంగా గీత పిఠాపురం నుంచి అభ్యర్దిగా బరిలో నిలిచారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ నియోజకవర్గంలోని కాపు ముఖ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

హోరా హీరీగా
ఇప్పుడు పవన్ కల్యాణ్ తన వరుస సమావేశాల ద్వారా పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని పవన్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ కౌంటర్ వ్యూహం అమలు చేస్తోంది. కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పేరు దాదాపు ఖాయమైంది. అయితే, తాను కాకినాడ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీలో ఉంటారని గతంలోనే పవన్ స్పష్టం చేసారు. కాకినాడ ఎంపీ అభ్యర్ది పేరు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. బీజేపీ సూచన మేరకు ఈ ప్రకటన ఉంటుందని పవన్ వెల్లడించారు. ఇప్పుడు, పిఠాపురంలో పవన్ గెలుపుకు వర్మ సహకారం కీలకం కానుంది. దీంతో, ఇక పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో ఏపీ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications