అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ - పొత్తులపై కీలక నిర్ణయాలు..!?

రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన రాజకీయ వ్యూహాలు ఏంటి. ఇప్పుడు పవన్ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ అధికారికంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం అని చెబుతున్న పవన్ ఎక్కడా బీజేపీతో కూడిన ప్రభుత్వం అని చెప్పటం లేదు. ఇదే సమయంలో తెలంగాణలో పొత్తుల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఈ సమయం లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పవన్ భేటీ పై అంచనాలు పెరుగుతున్నాయి.

అమిత్ షా తో పవన్ భేటీ:హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 26 గురువారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. అక్టోబర్ 27న నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో జరిగే ఐపీఎస్ అధికారుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొంటారు. అదే రోజున అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్ ను బీజేపీ కోరింది. మరోవైపు తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకం కాబోతోంది. తెలంగాణలో తాను బీజేపీకి సహకరించేందుకు పట్టు విడుపులతో సిద్దగా ఉన్నాని..ఏపీలోనూ టిడిపి జనసేన కూటమితో కలిసి రావాలని అమిత్ షా ను పవన్ కళ్యాణ్ కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan to meet Amith Shah on 27th, may finalise alliance in Telangana Elections

సహకారానికి సిద్దం:తెలంగాణలో జనసేన ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఇప్పటికే వ్యక్తపరిచారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఇటీవల పవన్‌కల్యాణ్‌ను కలసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించారు.

జనసేనకు 5లేదా 6 ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉంది. గ్రేటర్‌ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సెగ్మెంట్లతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని సరిహద్దు నియోజకవర్గాలను కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. కనీసం 20 సీట్లు కేటాయించాలని కోరుతున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమైన సమయంలో తెలంగాణలో తాము సీట్ల విషయంతో పాటుగా మద్దతు పరంగా సహకరిస్తామని..ఏపీ అంశం పైన తేల్చాలని అమిత్ షా ను కోరున్నట్లు సమాచారం.

Pawan Kalyan to meet Amith Shah on 27th, may finalise alliance in Telangana Elections

ఏపీలో పొత్తులే కీలకంగా:తాను ఎన్డీఏలోనే భాగస్వామిగా ఉన్నానని..ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో తాను టీడీపీతో పొత్తు ప్రకటించాల్సి వచ్చిందని వివరిస్తారని చెబుతున్నారు. తెలంగాణలో సహకారం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలు పవన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో బీజేపీ వైఖరి ఏంటనేది పవన్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారటంతో అక్కడ తమ రెండు పార్టీలు సహకరిస్తామని..ఏపీలో తమకు మద్దతు ఇవ్వాలని పవన్ ప్రతిపాదించనున్నారు.

ఇప్పటికే తమతో పొత్తు కొనసాగిస్తూ..టీడీపీతో పవన్ జత కలవటం పైన బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో పవన్ టీడీపీతో కలవటం పైన చేసే ప్రతిపాదనలకు అమిత్ షా ఏం చెప్పబోతున్నారనేది కీలకం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొత్తుల అంశం పైన ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+