పవన్ కల్యాణ్ దెబ్బకు గూగుల్ షేక్ అయిందిగా..!

2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఎంతోమంది గూగుల్‌లో సెర్చ్ చేయబడ్డారు.

ఇలా 2024లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ వ్యక్తుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ అయిదో స్థానంలో నిలిచారు. అలాగే ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఏపీ ఎన్నికల్లో ఆయన రాణించడం, కేంద్ర రాజకీయాల్లో కూడా తనదైన పాత్ర పోషించడం వల్ల ఆయన పేరును అత్యధికంగా సెర్చ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Pawan Kalyan top the list of most searched people in google

చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికి ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

లక్షలాది అభిమానులు ఆయన్ను అభిమానిస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కల్యాణ్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం గురించి కూడా అందరికి తెలిసిందే. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి ఇద్దరి భార్యలకు పవన్ కల్యాణ్ విడాకులిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+