ట్రెండ్ సెట్టర్ ఎవరు..యంగ్ టైగర్‌ను పవర్ స్టార్ బీట్ చేస్తారా..సోషల్ మీడియాలో కొత్త వార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. సినిమాలైనా రాజకీయాలైనా ఆ స్టామినానే వేరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇందుకు అతనంటే ఎంతో ఇష్టపడే అభిమానులే కారణం. అవును పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని చెప్పే అభిమానులు కొందరైతే... ఆయన్ను దేవుడిని చేసి పూజించే అభిమానం మరికొందరిది. అధికారంలో ఉన్నా లేకపోయిన తన స్టామినా వేరంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. సినిమాల నుంచి రాజకీయాలవైపు అడుగులు వేసిన పవర్ స్టార్ పొలిటికల్‌గా విత్‌స్టాండ్ కాకపోయినప్పటికీ తనకంటూ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారంటే ఇందుకు కారణం తన అభిమానులే అని చెప్పక తప్పదు. ఇక ఎలాంటి కార్యక్రమం లేకుండా పవర్ స్టార్ ఎందుకు ట్రెండ్ అవుతున్నారు..? దీని వెనక కథేంటి..?

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ట్రెండింగ్

"నేను ట్రెండ్‌ను ఫాలో కాను ట్రెండ్‌ను సెట్ చేస్తా " అని గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది... బొమ్మ పడిందంటే చాలు దద్దరిల్లాల్సిందే అన్నట్లుగా ఉంటుంది గబ్బర్ వ్యవహారం. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా పవన్ రూటే సపరేటు అని చెబుతుంటారు అతని సన్నిహితులు. ఇక జనసేనాని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ట్రెండ్ అవుతున్నారంటే ఆయన ఏదో కార్యక్రమం లేదా కొత్త సినిమా మొదలెట్టేశారని కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తేదీన ఉండగా ఇప్పటి నుంచే జనసేనానికి అడ్వాన్స్ బర్త్‌డే విషెస్‌ అందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు తమదైన రీతిలో వినూత్న పద్దతిలో వీడియో పోస్టింగులు పెడుతూ గబ్బర్‌సింగ్‌‌కు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ 2వ తేదీ కదా పవన్ కళ్యాణ్ బర్త్‌డే మరి ఇప్పటి నుంచే ఎందుకు ఇదంతా అని అభిమానులను అడిగితే వారిచ్చే సమాధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ పవర్ స్టార్

ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆ సమయంలో జూనియర్ సోషల్ మీడియాపై ట్రెండ్ అయ్యారు. బర్త్‌డే విషెస్ చెబుతూ అభిమానులు విపరీతంగా ట్వీట్లు చేయడం పోస్టులు చేయడంతో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డును చెరిపివేసి ఎలాంటి వేడుక లేకున్నప్పటికీ పవన్ స్టామినా ఏమిటో తెలియచెప్పాలని ఇప్పటి నుంచే జనసేనాని ఫ్యాన్స్ #AdvanceHBDPawanKalyan పేరుతో ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.

ఎన్టీఆర్ రికార్డు ఏంటి..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ 12 మిలియన్ ట్వీట్స్‌తో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించాలని, అది కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కంటే ముందు పూర్తవ్వాలనే లక్ష్యంతో ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాదు కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండేందుకు వీడియోలను కూడా పోస్టు చేస్తున్నారు. ఎలాంటి వేడుక లేద సందర్భం లేకుండానే పవన్ స్టామినా ఏమిటో నిరూపించేందుకు చిన్న టీజర్‌ను ఫ్యాన్స్ విడుదల చేశారు. ఇక వాట్సాప్‌లలో, ఫేస్‌బుక్‌లలో పవర్ స్టార్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ క్రేజీ పోస్టింగ్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.

అన్‌లాక్‌ సందర్భంగా ఏపీలో అడుగుపెట్టని జనసేనాని

ఇక పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో తెరపై కనిపించడం లేదు. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో హైదరాబాదుకే పరిమితమైయ్యారు. అంతకుముందు షూటింగ్‌లలో పాల్గొన్నారు. ఇక లాక్‌డౌన్ తర్వాత హైదరాబాదుకే పరిమితమైన జనసేనాని ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు ట్విటర్‌ను వేదికగా చేసుకున్నారు. ట్విటర్ వేదికగా పలు విమర్శలు గుప్పించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తర్వాత బాధితులను పరామర్శించేందుకు పవన్ వస్తారని అంతా ఆశించినప్పటికీ తాను హైదరాబాదును వీడి రాకపోవడంతో పలువురు విమర్శలు గుప్పించారు. ఇక అన్‌లాక్ తర్వాత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఏపీలో పర్యటించారు. కానీ పవన్ మాత్రం ఇప్పటి వరకు ఏపీలో అడుగుపెట్టకపోవడం వెనక కారణమేంటని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+