పవన్ కళ్యాణ్, నాని ఎందుకు దుమ్మెత్తి పోసుకున్నారు: కారణం అదేనా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, నేతలు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేశినేని నాని వంటి వారు దుమ్మెత్తి పోశారు. పవన్ పైన విమర్శలు చేయవద్దని అధినేత చంద్రబాబు సూచించినా నేతలు ఘాటుగా స్పందించారని తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. పవన్ వెనుక పొట్లూరి వరప్రసాద్ ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. విజయవాడ లోకసభ స్థానానికి పోటీ చేసేందుకే పవన్ కళ్యాణ్ వెనుక పొట్లూరి ఉన్నారనే ఊహాగానాలు సైతం వినిపించాయి.
అయితే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ నుండి విరమించుకోవడం, టీడీపీ - బీజేపీలకు మద్దతు పలికడం జరిగింది. దీనిపై అప్పట్లో పొట్లూరి అలక వహించారనే వార్తలు వచ్చాయి.

ఇక, రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సీమాంధ్ర ఎంపీల పైన విమర్శలు గుప్పించే సమయంలో మరీ ముఖ్యంగా కేశినేని నాని పేరును ప్రస్తావించారు. కేశినేని నాని వంటి వారు ఎంపీ టిక్కెట్టు తెచ్చుకునే సమయంలో ఉగ్రరూపం చూపించారని, తర్వాత మౌనం వహిస్తున్నారని పవన్ మండిపడ్డారు.
మరీ ప్రత్యేకంగా కేశినేని నాని పేరును తీసుకోవడం వెనుక నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తీరును నేరుగా చూసినందువల్లే అని అంటున్నారు.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయవద్దని, ఆయన టీడీపీ మిత్రుడు అని చంద్రబాబు చెప్పాక.. మిగతా నాయకులు కొంత మిన్నకుండిపోయారని చెబుతున్నారు. కానీ కేశినేని నాని మాత్రం తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.
నాటి ఎంపీ సీటు గొడవ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్.. కేశినేని నాని పైన మండిపడ్డారని, అందుకే కేశినేని నాని కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications