పవన్ కళ్యాణ్ బిజీబిజీ: అన్నింటినీ మేనేజ్ చేస్తున్న 'సర్దార్'!

హైదరాబాద్/విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్కువగా ఆకాశంలో ప్రయాణిస్తున్నారు! ఓ వైపు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌లో బిజీబిజీగా ఉంటూనే రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ చర్చనీయాంశమవుతున్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో కొద్ది రోజుల క్రితం హడావుడిగా కేరళ నుంచి హైదరాబాద్ వచ్చారు. పదిహేను రోజుల క్రితం తునిలో కాపు గర్జన ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగులో ఉన్న పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చారు.

Also Read: వాటే క్రేజ్ : పవన్ తో సెల్ఫీ కోసం పోటాపోటీ (ఫొటోలు)

సోమవారం సాయంత్రం తుని ఘటన, కాపుల అంశం పైన స్పందించారు. నాటి విలేకరుల సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుతిమెత్తని చురకలు అంటించారు. ఆ తర్వాత ఇటీవలే అంబటి రాంబాబు కూతురు పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

Pawan Kalyan very busy with shooting, politics

మరోవైపు, తన సోదరుడు చిరంజీవి రెండో కూతురు శ్రీజ పెళ్లి విషయమై కూడా కుటుంబ సభ్యులతో చర్చించేందుకు ఓ రోజు అతను వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలా ఓ వైపు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో బిజీగా ఉంటూనే మరోవైపు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇందుకోసం నిత్యం అతను ప్రత్యేక చాపర్ వస్తున్నారని అంటున్నారు. తద్వారా అతను ఇటీవలి కాలంలో ఎక్కువగా గాలిలో ప్రయాణిస్తున్నారని చెప్పవచ్చు. అంత బిజీలోను పవన్ కళ్యాణ్ వీటిని ఎలా మేనేజ్ చేస్తున్నారనే చర్చ సాగుతోంది. అదే సమయంలో ఖర్చు గురించి కూడా చర్చ జరుగుతోందంటున్నారు.

ఇదిలా ఉండగా, సర్దార్ గబ్బర్ సింగ్‌లో కాపు అంశాన్ని పవన్ కళ్యాణ్ సృషిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీకి గుర్తింపు, సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తయ్యాక.. పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన పైన ఏమైనా దృష్టి సారించవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+