ప‌వ‌న్ పై లోకేష్ పోటీ..! వైసిపి నుండి అవంతి : భీమిలి లో సిస‌లైన రాజ‌కీయం : గెలిచేదెవ‌రు..!

ఏపి లో అస‌లైన ఎన్నిక‌ల మ‌జా మొద‌లైంది. విశాఖ జిల్లా భీమిలి లో ఈ సారి జ‌రిగే ఎన్నిక‌లు ఏపి లోని సిస‌లైన రాజ‌కీ యానికి వేదిక‌గా మార‌బోతోంది. భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మైంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయాల‌ని మంత్రి లోకేష్ నిర్ణ‌యించారు..! ఇక‌, ఇప్ప‌టికే ఇక్క‌డ వైసిపి అభ్య‌ర్దిగా అవంతి శ్రీనివాస రావు బ‌రిలోకి దిగుతున్నారు. దీంతో..ఇక్క‌డ ఫ‌లితం ఎలా ఉండ‌బోతోంది..

భీమిలి సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్...

భీమిలి సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్...

విశాఖ జిల్లా భీమిలి 2019 ఎన్నిక‌ల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తోంది. ఇక్క‌డ నుండి ఇప్పుడు ప్ర‌ముఖులు పోటీకి దిగుతున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్దిగా గెలిచిన అవంతి శ్రీనివాస రావు 2014 ఎన్నిక‌ల వేళ టిడిపిలో చేరారు. ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచారు. కొద్ది రోజుల క్రితం ఆయ‌న టిడిపిని వీడి వైసిపి లో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో భీమిలి నుండి టిడిపి అభ్య‌ర్ది గంటా శ్రీనివాస రావు గెలిచారు. ప్ర‌స్తుతం అయ‌న మంత్రిగా ఉన్నా రు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవంతి వ‌ర్సెస్ గంటా పోరు ఇక్క‌డ జ‌రుగుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, ఇంత‌లో ఈ సీటు పై అటు జ‌న‌సేన అధినేత‌..ఇటు మంత్రి లోకేష్ దృష్టి సారించారు. విశాఖ జిల్లా టిడిపి నేత‌లు సైతం లోకేష్ ను ఇక్క‌డి నుండి పోటీ చేయాల‌ని ఆహ్వానించారు. తాజాగా, లోకేష్ భీమిలి నుండి పోటీకి సై అంటున్నారని స‌మాచారం.

లోకేష్ న‌మ్మ‌కం ఇదీ..

లోకేష్ న‌మ్మ‌కం ఇదీ..

ఎమ్మెల్సీగా చ‌ట్ట స‌భ‌ల్లో అడుగు పెట్టి మంత్రి అయ్యారు లోకేష్‌. ఈ సారి ఆయ‌న కుప్పం నుండి పోటీ చేస్తార‌ని లేదా గుంటూరు జిల్లా పెదకూర‌పాడు అని... కృష్ణా జిల్లా పెనుమ‌లూరు నుండి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ సీట్ల‌లో సీట్లు కాకుండా..ఉత్త‌రాంధ్ర నుండి పోటీ చేయాల‌ని లోకేష్ నిర్ణ‌యించారు. తొలుత శ్రీకాకుళం నుండి పోటీ చేయాల‌ని ఆలోచ‌న చేసారు. కానీ, విశాఖ న‌గ‌రంలో పార్టీకి ప‌ట్టు నిల‌బెట్టుకోవాలంటే తాను విశాఖ న‌గ‌రం నుండి పోటీ చేస్తే ఆ ప్ర‌భావం స‌మీప నియోజ‌క‌వ‌ర్గాల పై ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. భీమిలి కేంద్రంగా ఐటి మంత్రిగా తాను చేసిన అభివృద్ది..చేసుకున్న ఒప్పందాలు..త‌న‌కు అక్క‌డ ప్ల‌స్ గా ఉంటాయ‌ని భావిస్తున్నారు. భీమిలి నియోజ‌క వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 సార్లు ఎన్నిక‌లు జరిగితే...అందులో ఆరు సార్లు టిడిపి గెలిచింది. దీంతో..లోకేష్ భీమిలి నుండి పోటీకి నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

లోకేష్ పై ప‌వ‌న్ పోటీ..

లోకేష్ పై ప‌వ‌న్ పోటీ..

ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం ఈ సారి రాయ‌ల‌సీమ తో పాటుగా ఉత్త‌రాంధ్ర నుండి పోటీ చేయాల‌ని దా దాపు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ప‌వ‌న్ సైతం భీమిలి నుండి పోటీ చేయ‌టం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. టిడిపి కి మ‌ద్ద‌తుగా 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన ప‌వ‌న్ గ‌త ఏడాది మార్చి లో గుంటూరు లో జ‌రిగిన స‌భ‌లో లోకేష్ ను ల క్ష్యం గా చేసుకొని అవినీతి ఆరోప‌ణ‌లు చేసారు. అప్ప‌టి నుండి ఆరోప‌ణ‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఇక‌, రాజ‌కీయం గా భీమిలి జ‌న‌సేన‌కు క‌లిసి వ‌చ్చే సీటుగా భావిస్తున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ప్ర‌జారాజ్యం గెలిచింది. ఇక‌, ఇప్పు డు లోకేష్ అక్క‌డి నుండి టిడిపి అభ్య‌ర్ది కావ‌టంతో..జ‌న‌సేన నుండి ప‌వ‌న్ బ‌రిలోకి దిగ‌టం దాదాపు ఖాయం. ఇక‌, వైసిపి నుండి అవంతి శ్రీనివాస్ బ‌రిలో ఉంటారు. దీంతో..ఇక్క‌డ జ‌రిగే ఈ త్రిముఖ పోరు రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కంగా మారుతోంది. మ‌రి..హోరా హోరీ పోరులో చివ‌ర‌కు గెలిచేదెరు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+