కంటతడి పెట్టిన పవన్, బెడ్ పక్కన అలాగే... (పిక్చర్స్)

ఖమ్మం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. శ్రీజను చూసిన పవన్ కంటతడి పెట్టారు. పవన్ కళ్లు చెమర్చాయి. అక్కడున్నంత సేపు ఆయన ఆవేదనగా కనిపించారు. శ్రీజ పరిస్థితిను చూసి చలించిపోయారు. పవన్ ఆసుపత్రికి వస్తుండని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనను చూసేందుకు తరలి వచ్చారు.

ఉదయం ఖమ్మం చేరుకున్న పవన్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీజ ఉంటున్న రూంలోకి వెళ్లి, బెడ్ పక్కనే అలాగే నిలుచుండి పోయారు. పవన్ రాగానే శ్రీజ కుటుంబ సభ్యులు కూడా కంటతడి పెట్టారు. ఇది అక్కడున్న వారినందరినీ కదిలించింది. శ్రీజ స్పందించే స్థితిలో లేకపోవడంతో పవన్ నిరాశ, ఆవేదనకు గురయ్యారు. నీకోసమే వచ్చానని పలుమార్లు శ్రీజ చెవి వద్ద చెప్పారు.

అంతకుముందు, రాజమండ్రిలో మాట్లాడిన పవన్.. హుధుద్ తుఫాను బాధితులకు అందరూ అండగా నిలవాలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు నివారణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తుఫాను పునరావాస సహాయక చర్యల్లో సినీ పరిశ్రమ పాలు పంచుకోవడం అభినందనీయమన్నారు. మున్ముందు ఉత్తరాంధ్రలో పునరావాస కార్యక్రమాల్లో జనసేన పాలు పంచుకుంటుందన్నారు.

పవన్ కళ్యాణ్ బుధవారం, గురువారం విశాఖలో పర్యటించిన విషయం తెలిసిందే. హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం గురువారం ఉదయం చంద్రబాబు నాయుడును కలిసి యాభై లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మంలోని కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీజను పరామర్శించేందుకు వచ్చారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మంలోని కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీజను పరామర్శించేందుకు వచ్చారు. ఈ సమయంలో అక్కడకు భారీగా వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ..

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను పరామర్శించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

శ్రీజను చూసిన పవన్ కంటతడి పెట్టారు. పవన్ కళ్లు చెమర్చాయి. అక్కడున్నంత సేపు ఆయన ఆవేదనగా కనిపించారు. శ్రీజ పరిస్థితిను చూసి చలించిపోయారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను పరామర్శించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

శ్రీజను చూసిన పవన్ కంటతడి పెట్టారు. పవన్ కళ్లు చెమర్చాయి. అక్కడున్నంత సేపు ఆయన ఆవేదనగా కనిపించారు. శ్రీజ పరిస్థితిను చూసి చలించిపోయారు.

ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పని తీరును కొనియాడారు. ప్రభుత్వాల ముందు చర్య వల్ల నష్టం తగ్గిందన్నారు. చంద్రబాబు, మోడీల పని బాగుందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మేక్ ఏ విష్ ఫౌండేషన్ శ్రీజ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకు రావడంతో ఆయన స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+