తిరుమల లడ్డూ వివాదం, సుప్రీం కోర్టు తీర్పుపై పవన్ కల్యాణ్ రియాక్షన్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, సుప్రీం కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ ప్రత్యేక స్వతంత్ర సిట్ విచారణలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. స్వతంత్ర సిట్ విచారణ జరిపితే అసలు సత్యాలు వెలుగులోకి వస్తాయని, నిజానిజాలు తెలుసుకోవాలని శ్రీవారి భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుల హయాంలోనే తిరుమల శ్రీవారి లడ్డు, అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందని భక్తులు చాలాసార్లు ఆరోపించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

గత టీటీడీ పాలక మండళ్లు తీసుకున్న నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని వాటిని పరిశీలించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో అపవిత్ర చర్యలు తీసుకున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీవారి భక్తులకు హామీ ఇచ్చారు.
గత టీటీడీ పాలక మండళ్లు తీసుకున్న నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం పరిశీలించి వాటిలోని లోపాలు గుర్తిస్తుందని, ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు వినియోగంపై సనాతన ధర్మాన్ని పాటిస్తున్న కోట్లాదిమంది హిందువులు ఆందోళనలో ఉన్నారని, వారికి నిజానిజాలు తెలియజేయడం కూటమి ప్రభుత్వం బాధ్యత అని పవన్ కల్యాణ్ అన్నారు. మరొకసారి ఏఒక్కరు కూడా శ్రీవారి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications