వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూఎన్టీఆర్, చిరు దూరమే!: దగ్గరౌతున్న బాబు, పవన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు క్రమంగా దగ్గరవుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపి కూటమికి ప్రచారం చేశారు.

ప్రచారం సమయంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రచారంలో చంద్రబాబును పొగడటంతో పాటు.. తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపికి మద్దతిచ్చినట్లు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రచారంతో సీమాంధ్రలో టిడిపికి మంచి ఊపు వచ్చిందని ఆ పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. తాము 120 స్థానాల వరకు గెలుస్తామని చెబుతున్నారు. ఇందులో పవన్ పాత్ర కూడా ఎంతో ఉందని చెబుతున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత పవన్‌కు బాబు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు గురువారం విందుకు కూడా ఆహ్వానించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఈ ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు పెట్టుకోవడం, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి మద్దతిచ్చేందుకు సిద్దమవడం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది. పవన్, చంద్రబాబులు రోజురోజుకు మరింత దగ్గరవుతున్నారు.

చిరంజీవి

చిరంజీవి

కుటుంబపరంగా తమ మధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మధ్య ఎలాంటి విభేదాల్లేవు. రాజకీయంగా మాత్రం చిరంజీవికి పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు పవన్, చంద్రబాబుల కలయికలు చూస్తుంటే అన్నాదమ్ముల మధ్య రాజకీయ వైరుద్యం ఇక ముందు కూడా ఉండేలా కనిపిస్తోంది.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

2009 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి హీరో జూనియర్ ఎన్టీఆర్ జోరుగా ప్రచారం చేశారు. ఈసారి మాత్రం చంద్రబాబు, బాలయ్యల పైన అసంతృప్తితో ఉన్న జూనియర్ ప్రచారం చేయలేదు. అలాగే టిడిపి కూడా ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త మిత్రుడు పవన్ దొరికినందున జూనియర్‌ను కూడా వారు ఇక పక్కన పెట్టే అవకాశముంది.

 బాలకృష్ణ

బాలకృష్ణ

గతంలో నందమూరి, మెగా అభిమానుల మధ్య విభేదాలు కనిపించేవి. వారి వారి సినిమాలలో కూడా అవి కనిపించేవి. మెగా ఫ్యామిలీ చిత్రాల్లో నందమూరి ఫ్యామిలీ పైన, నందమూరి ఫ్యామిలీ చిత్రాల్లో మెగా ఫ్యామిలీ పైన సెటైర్లు ఉండేవి. ఇప్పుడు మాత్రం పవన్ టిడిపికి దగ్గరవుతున్నారు.

English summary
Jana Sena Party chief Pawan Kalyan went to Chandrababu's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X