టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు పవన్ భార్య భారీ విరాళం..

ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా లెజినోవా.. టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు భారీ విరాళం అందించారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడ్డారు. అయితే బాలుడు సురక్షితంగా బయటపడంతో ఆమె శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే నేటి మధ్యాహ్నం అన్నవితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చారు. తమ కుమారుడు మార్క్‌ శంకర్‌ పేరుతో రూ.17లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. దీంతో ఆమెను ప్రశంసిస్తూ జనసేన నేతలు, మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

pawan-kalyan-wife-makes-a-huge-donation-to-ttd-sv-annadanam-trust

ఇక ఈరోజు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో అన్నా పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అంతే కాకుండా ఆదివారం నాడు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు అన్నా లెజినోవా. కుమారుడు మార్క్‌శంకర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలలోని గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూ వరహా స్వామి దర్శనం అనంతరం కల్యాణకట్టకు చేరుకొని అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు.

#PawanKalyan #MarkShankar #AnnaLezhneva #TTD #Tirumala #Tirupati #OITelugu

Posted by Oneindia Telugu onSunday 13 April 2025

వివాహానికి ముందు అన్నలెజినోవా క్రిస్టియన్ అయినప్పటికి పవన్ సతీమణిగా మారిన తర్వాత ఆమె హింధూదర్మాన్ని పాటిస్తూ పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు పవన్ కల్యాణ్ వెంట దైవదర్శనానికి కూడా వెళ్లారు. రీసెంట్ గానే కుంభమేళాలో పవన్ తో కలిసి పవిత్రస్నానం కూడా ఆచరించారు. ఇప్పుడు తిరుమలకు వచ్చి సాధారణ భక్తురాలిగానే తలనీలాలు సమర్పించడం.. డిక్లరేషన్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో వివాదం నడుస్తోంది. క్రిస్టియన్ అయిన ఆమెతో బలవంతంగా కావాలనే ఇలా చేయిస్తున్నారని కొందరు రాద్దాంతం చేస్తుంటే .. పవన్ అభిమానులు, జనసైనికులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+