తెలంగాణలో ఎన్నికలు వస్తే పోటీ చేస్తా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తన పార్టీ పోటీ చేస్తుందని, తాను కూడా పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన పలు విషయాల గురించి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అనుభవం కోసమైనా తాను పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అవసరమైతే తాను కూడా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తాను ఎంపినో, ఎమ్మెల్యేనో కావాలనుకుంటే ఆయ్యేవాడినని చెప్పారు.

హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. తన పార్టీ బలం లేదని, నిధులు కూడా లేవని ఆయన చెప్పారు. సమస్యలపై పోరాటం చేయడానికి తనకు పరిమితులూ పరిధులూ ఉన్నాయని ఆయన చెప్పారు.
సమస్యలపై జయప్రకాష్ నారాయణ మాట్లాడుతున్నారని, పోరాటాలు చేయడానికి సిపిఎం సిపిఐలూ ఉన్నాయని, తాను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. సరైన వ్యక్తులు తనకు కావాలని ఆయన అన్నారు. ఈలోగా ఎన్నికలు వస్తే అనుభఢవం కోసమైనా పోటీ చేస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications