పవన్ కళ్యాణ్‌పై ఇప్పటికీ ఆశలు: 2019లో యూటర్న్ తీసుకుంటారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: 2019 ఎన్నికల నాటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతారా? అంటే అవుననే అంటున్నారు కమలం పార్టీ నేతలు. పవన్‌ను వదులుకునేందుకు టిడిపి గానీ, బీజేపీ గానీ సిద్ధంగా లేవు.

టిడిపి, బిజెపిలు 2019 నాటికి కలిసే పోటీ చేస్తాయని దాదాపు తేలిపోయింది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేసినా.. ఎవరికి వారు జనసేన అధినేత కోసం పావులు కదుపుతారు. 2014లో బీజేపీకి - మోడీకి మద్దతు పలికినట్లుగానే 2019లోను తమకు అండగా నిలబడతారని బిజెపి నేతలు అంటున్నారు.

పవన్-బీజేపీ మధ్య విభేదాలు తొలగిపోతాయని..

పవన్-బీజేపీ మధ్య విభేదాలు తొలగిపోతాయని..

తాజాగా, బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు ఈ అంశంపై ధీమా వ్యక్తం చేసారు. 2019 నాటికి పవన్ కళ్యాణ్ - బిజెపి మధ్య ఉన్న విభేదాలు (అంశాలు) అన్నీ తొలగిపోతాయని చెప్పారు. పవన్ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.

పవన్ ఎలా కన్విన్స్ అవుతారు?

పవన్ ఎలా కన్విన్స్ అవుతారు?

ఇరువురి మధ్య ఇబ్బందులు తొలగిపోతాయంటే.. ప్రత్యేక ప్యాకేజీ పైన పవన్ కళ్యాణ్‌కు అర్థమయ్యేలా బీజేపీ చెబుతుందా? లేదా మరేదైనా ఉందా? అనేది చూడాలి. ఇప్పుడు ఇరువురి మధ్య గ్యాప్ ఉన్నంత మాత్రాన రేపు ఒక్కటి కాలేమని భావించవద్దని వీర్రాజు ఇటీవల చెప్పారు.

టిడిపిపై మాత్రం మరోలా..

టిడిపిపై మాత్రం మరోలా..

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెబుతున్నారు. ఆయా పార్టీల సిద్ధాంతాలపరంగా పొత్తులు ఉంటాయని చెప్పారు. అదే సమయంలో టిడిపితో పొత్తు గురించి మాట్లాడుతూ... 2019 ఎన్నికల సమయంలో తెలుస్తుందని చెప్పారు.

చంద్రబాబుకు షాకిస్తారా?

చంద్రబాబుకు షాకిస్తారా?

2019లో మోడీ నేతృత్వంలోనే ముందుకెళ్తామని చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో చెప్పారు. కానీ కొందరు బీజేపీ నేతలు మాత్రం.. టిడిపితో పొత్తు ఎన్నికల సమయంలోనే తెలుస్తుందని చెబుతున్నారు. వారి వ్యాఖ్యలు చంద్రబాబుకు షాకేనని చెప్పవచ్చు.

బీజేపీలో రెండు రకాలుగా...

బీజేపీలో రెండు రకాలుగా...

ఏపీ టిడిపికి దూరం జరగాలని ఏపీ బీజేపీ నేతల్లో పలువురు కోరుకుంటున్నారు. మరికొందరు కలిసి ఉంటేనే మంచిది అని భావిస్తున్నారు. దూరం కోరుకునే పురంధేశ్వరి, సోము వీర్రాజు వంటి నేతలు ఎప్పటికప్పుడు టిడిపిని విమర్శిస్తున్నారు.

పవన్‌పై ఆచితూచి.. ఏం చేస్తారు?

పవన్‌పై ఆచితూచి.. ఏం చేస్తారు?

పవన్ కళ్యాణ్‌పై బీజేపీ, టిడిపి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. సోమవారం కూడా సోము వీర్రాజు... పవన్ ప్రశ్నించడంపై మాట్లాడారు. పవన్ ఏ అంశం పైన అయినా ప్రశ్నించవచ్చునని తేల్చి చెప్పారు. తాము కూడా అధికార పార్టీతో స్నేహంతో ఉన్నంత మాత్రాన సమస్యలపై ప్రశ్నించకుండా ఉండలేమని తేల్చి చెప్పారు.

2019లో టిడిపి - బిజెపి కలిసి పోటీ చేసే అవకాశముందా? లేక పవన్ కళ్యాణ్ అండతో బీజేపీ చంద్రబాబును దూరం పెడుతుందా? అసలు హోదా కోసం నిలదీస్తున్న పవన్ వీరితో కలిసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అనేది ముందు ముందు తేలుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan may join hands with BJP in 2019.
Please Wait while comments are loading...