స్పెషల్ అట్రాక్షన్: బాబుని కౌగిలించుకున్న పవన్‌కళ్యాణ్
విజయవాడ/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును వేదిక పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌగిలించుకొని అభినందనలు తెలిపారు. పవన్ సభాస్థలికి చేరుకొని కారు దిగగానే నారా లోకేష్ స్వాగతం పలికారు.
వేదిక పైకి వచ్చిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు పలకరించారు. అక్కడ చంద్రబాబు, పవన్ కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. ప్రమాణ స్వీకారానికి బిజెపి అగ్రనేతలు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రిలు వచ్చారు. వేదిక పైన పవన్ కళ్యాణ్ వారందరికంటే కొంత స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

అభిమానులు, తెలుగు తమ్ముళ్లు టిడిపి జెండాలతో పాటు జనసేన పార్టీ జెండాలను కూడా వెంట తీసుకు వచ్చి ప్రదర్శించారు. జై టిడిపి, జై చంద్రబాబు, జై పవన్, జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
వేదిక వద్దకు చేరుకున్న అద్వానీ సహా పలువురు జాతీయ నాయకులను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి స్వాగతించారు. అతిథర మహారథుల రాకతో వేదిక ప్రాంగణంలో సందడి వాతావరణం మిన్నంటింది.












Click it and Unblock the Notifications