పవన్ భీమవరం పర్యటన వాయిదా: సిల్లీ రీజన్ చెప్పిన జనసేన

Pawan Kalyans Bhimavaram tour has been postponed
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన ఏపీ పర్యటన వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో బుధవారం నుంచి ఆయన ఏపీలో విస్తృతంగా పర్యటించాల్సి ఉండగా.. ఒక్క రోజు ముందు దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.

ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం- పవన్ కల్యాణ్ ఈ నెల 14వ తేదీ అంటే బుధవారం నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసింది పార్టీ అగ్ర నాయకత్వం. భీమవరం నుంచి ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది.

తన ఎన్నికల ప్రచారానికి భీమవరం నుంచే పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టబోతోన్నారని జనసేన పార్టీ ప్రకటించింది కూడా. గోదావరి జిల్లాల తరువాత కూడా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపింది. దీని కోసం హెలికాప్టర్‌ను సిద్ధం చేసుకున్నారు పవన్ కల్యాణ్. భీమవరంలో బహిరంగసభను నిర్వహించడానికి ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు.

చివరి నిమిషంలో ఈ పర్యటన వాయిదా పడింది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతించట్లేదని, అందువల్లే పవన్ కళ్యాణ్ తన భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిపింది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించింది. అధికార యంత్రాంగంపై ఒత్తిళ్లను తెచ్చిందని విమర్శించింది.

ఈ మేరకు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. దీన్ని జనసేన అధికారిక ఎక్స్ అకౌంట్ రీట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా పడిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించినట్టయింది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వట్లేదనే కారణంతో పర్యటన వాయిదా వేసుకోవడం పట్ల అటు జనసేన పార్టీ శ్రేణులు సైతం నిరుత్సాహానికి గురవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+