చంద్రబాబు సింపథీ పవన్ హైజాక్ - సడన్ గా పొత్తు ప్రకటన వెనుక..!!
ఏపీలో ఎన్నికల పొత్తులు ఖాయమయ్యాయి. టీడీపీ, జనసేన పొత్తు అధికారికమైంది. రాజమండ్రి జైలులో చంద్రబాబును పరామర్శించిన పవన్ ఆ వెంటనే పొత్తు ప్రకటించారు. ఇప్పుడే నిర్ణయం తీసుకున్నానని చెప్పకొచ్చారు. పొత్తు ముందే ఊహించిన అంశం. అయితే, ఇప్పుడు ఇంత సడన్ గా జైలు సీమీపంలో ఎందుకు ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కొత్త చర్చ మొదలైంది. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో..పొత్తుపైన ఇలా ప్రకటన చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎందుకీ సడన్ ప్రకటన : సహజంగా పొత్తుల ప్రకటనకు మందే ముహూర్తం..మంచి సమయం చూసి ఖరారు చేస్తారు. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని అందరూ భావించారు. కానీ, పవన్ మాత్రం జైలులో చంద్రబాబుతో ములాఖత్ తరువాత నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. అధికారికంగా ప్రకటన చేసారు. అయితే..ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పొత్తు ప్రకటన చేయటం ఏంటనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు ను పరామర్శించటానికి వెళ్లిన పవన్ ఈ ప్రకటన చేయటం వెనుక భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీకి ఇప్పుడు పవన్ మినహా ఇతర పార్టీల నుంచి మద్దతు లేదు. దీంతో, పవన్ మరింతగా టీడీపీ శ్రేణుల్లో సానుకూలత పెంచుకొనేందుకు సమయం చూసి ప్రకటన చేసారనే వాదన వినిపిస్తోంది.

చంద్రబాబు కోరితేనే చేసారా : చంద్రబాబు బెయిల్ విషయంలోనూ పార్టీ..న్యాయవాదులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ద్వారా సానుభూతి లెక్కల్లో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ సమయంలో పొత్తుల ప్రకటన ద్వారా పవన్ సింపథీని హైజాక్ చేసేసారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు వచ్చే వరకు ఆగితే జరిగే నష్టం ఏంటనే వాదన తెర మీదకు వచ్చింది. కీలకమైన ఎన్నికల పొత్తు ప్రకటన జైలు సమీపంలో చేయటం పైనా చర్చ మొదలైంది. చంద్రబాబు అరెస్ట్ తీవ్రత తెలిసేలాగా పొత్తు ప్రకటన జరిగిందనే అభిప్రాయమూ టీడీపీ నుంచి వినిపిస్తోంది. అయితే, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అందరూ అంచనా వేసిందే. అధికారికంగా పవన్ ప్రకటన మాత్రం చేసారు. ఈ ప్రకటన రాజకీయంగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.
బీజేపీతో ఇక దూరమేనా : చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ప్రచారం కొనసాగింపులో భాగంగానే పవన్ బీజేపీతో విభేదించేందుకు సిద్దమయ్యారనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నమనే విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో జాతీయ నాయకత్వందే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. జాతీయ నేతలు ఇప్పటికిప్పుడు దీని పైన స్పందించే అవకాశం కనిపించటం లేదు. ఈ నెల 16న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పొత్తు ప్రకటన చేసి...బీజేపీని రావాలని ఆహ్వానించిన విధానం పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక బీజేపీతో పొత్తు కోరుకుంటూ.. ఇలా రెండు పార్టీలు ప్రకటన చేసాయంటే..బీజేపీ నుంచి ఇక సానుకూల స్పందన రాదనే నిర్ణయానికి వచ్చే ప్రకటన చేసినట్లు స్పష్టం అవుతోందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications