పవన్ హవా, టిలో తిరగలేకపోయా: లగడపాటి క్షమాపణ

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం సీమాంధ్రలో స్పష్టంగా కనిపించిందని, ఉద్యమ ప్రభావం వల్లనే తాను తెలంగాణ ప్రాంతంలో తిరగలేకపోయానని విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ బుధవారం చెప్పారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన ఎగ్జిట్ పోల్ వివరాలను ఆయన బయటపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

కెసిఆర్ వ్యూహం ప్రకారం ట్రెండ్ సెట్ చేశారు

Pawan and Modi wave in Seemandhra: Lagadapati

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహం ప్రకారం తెలంగాణలో ట్రెండ్ సెట్ చేశారన్నారు. సీమాంధ్రలో మోడీ, పవన్, చంద్రబాబు హవా కనిపించిందన్నారు. కాంగ్రెసు వాదిగా కాంగ్రెసు పార్టీ ఓడిపోవడం తనను బాధిస్తోందన్నరు. ప్రస్తుతానికి తనకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఏం చేస్తానో ముందు ముందు చెబుతానని తెలిపారు. తాను సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాడానని చెప్పారు.

నాయకులు తిరగడం వల్లే..

విభజన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులు పార్టీ పైనే తిరగబడటం వల్ల ఆ ప్రాంతంలో కాంగ్రెసు తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం వైఖరి చాలామందిని బాధించిందన్నారు. ఈ విషయంలో తనకు కొంత బాధ ఉందన్నారు. లోకసభ సంఘటన దురదృష్టకరమని చెప్పారు. పార్టీపై తిరగబడటం నష్టం కలిగించిందన్నారు. విభజన నిర్ణయం తర్వాత నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారన్నారు. ఇది బాధాకరమైన విషయమే అన్నారు.

విలేకరులకు సారీ

తనకు ఇదే చివరి ప్రెస్ మీట్ కావొచ్చునని లగడపాటి చెప్పారు. గతంలో ఎవరి పట్లనైనా తాను దురుసుగా ప్రవర్తించి ఉంటే క్షమించాలని చెప్పారు. ఎవరు ఏమీ అనుకోవద్దన్నారు. విలేకరులు బాధపడితే సారీ అన్నారు.

డొక్కా వ్యాఖ్యలు నిజం

ఎన్నికల్లో ధన ప్రభావం పెరిగిపోయిందన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ వ్యాఖ్యలు అక్షర సత్యమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓడిపోయిన వారు కౌంటింగ్ సెంటర్ వద్ద ఏడిస్తే, గెలిచిన వారు ఇంటి వద్ద ఏడుస్తారని చెప్పారు.

పదేళ్ల ముందే వదిలేశా

తాను మరో పదేళ్లు రాజకీయాల్లో ఉండాలనుకున్నానని లగడపాటి చెప్పారు. కానీ పదేళ్ల ముందే నిష్క్రమించవలసి వచ్చిందన్నారు. ఇక రాజకీయాలతో తనకు ఏమాత్రం పని లేదన్నారు. తరతరాలుగా కాంగ్రెసు పార్టీని నమ్ముకున్న వారు అధిష్టానం నిర్ణయంతో ఆవేదన చెందారన్నారు. ఇది తనకు కూడా బాధను కలిగించిందన్నారు. తనకు ఎవరితోను విభేదాల్లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+