Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ తాజా ట్వీట్లు:తిట్ల మీదే టిడిపి నమ్మకం...ఆర్కేది తల్లి-చెల్లిని తిట్టే విభాగం

ప్రత్యర్థులపై పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్దం కొనసాగుతోంది. తాజాగా టిడిపి-బూతు జ్యోతి అంటూ టిడిపిని నేరుగా మరో తెలుగు పత్రికను పరోక్షంగా టార్గెట్ చేస్తూ మరోసారి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. టిడిపి తిట్ల మీదే నమ్మకం ఉంది...టిడిపి ఆయుధం తిట్లే అనేది పవన్ లేటెస్ట్ గా చేసిన ట్వీట్ల సారాంశం.

పైగా టిడిపిలో తల్లిని చెల్లిని తిట్టే ప్రత్యేక విభాగానికి మాత్రం బూతుజ్యోతి రత్న ఆర్కే ప్రధాన కార్యదర్శి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేశారు. ట్విట్టర్ వేదికగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ల యుద్దం సోమవారం ఉదయం నుంచే మళ్లీ మొదలైంది. ఉదయం 7.30 నుంచి పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థులపై ట్వీట్ల దండయాత్ర మొదలు పెట్టారు.

పవన్ కళ్యాణ్...నేటి తొలి ట్వీట్ ఇదే

పవన్ కళ్యాణ్...నేటి తొలి ట్వీట్ ఇదే

పవన్ ట్వీట్లు కొన్ని ఇంగ్లీష్ లో...మరి కొన్ని తెలుగులో ఉంటున్న సంగతి తెలిసిందే...సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు పవన్ కల్యాణ్ టిడిపిని ఉద్దేశించి ఇంగ్లీష్ లో తన తొలి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే..."తిట్ల మీదే మా విశ్వాసం" అనేదే టిడిపి నినాదమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

పవన్...రెండో ట్వీట్

పవన్...రెండో ట్వీట్

అమెరికన్ రాజ్యాంగం దేవుడి పైనే మా విశ్వాసం అంటూ ప్రారంభమవుతుందని...కానీ తెలుగు దేశం పార్టీ రాజ్యాంగం మాత్రం "తిట్ల మీదే మా విశ్వాసం"..అంటూ ప్రారంభం అవుతుందని పవన్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

పవన్...నేటి మూడో ట్వీట్

పవన్...నేటి మూడో ట్వీట్

ఇక పవన్ నేటి మూడో ట్వీట్ చూస్తే రెండో ట్వీట్ నే రిపీట్ చేసిన పవన్ దానికి అదనంగా మరో వాక్యం చేర్చారు....అదేమిటంటే...అమెరికన్ రాజ్యాంగం దేవుడి పైనే మా విశ్వాసం అంటూ ప్రారంభమవుతుందని...కానీ తెలుగు దేశం పార్టీ రాజ్యాంగం మాత్రం "తిట్ల మీదే మా విశ్వాసం"..అంటూ ప్రారంభం అవుతుందని...ఆ అమెరికన్ ఉపోద్ఘాతంలో దేవుడు అని ఉండే చోట టిడిపి రాజ్యాంగంలో తిట్లు అని ఉంటాయని మిగతా అంతా సేమ్ టు సేమేనని పవన్ వ్యంగాస్త్రం సంధించారు.

ఇక..పవన్ నాలుగో ట్వీట్

ఇక..పవన్ నాలుగో ట్వీట్

తొలి మూడు ట్వీట్లను టిడిపిని ఉద్దేశించి చేసిన పవన్ కళ్యాణ్ నాలుగో ట్వీట్ ను ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణపై ఎక్కుపెట్టారు. తిట్లనే నమ్మకున్న టిడిపిలో తల్లి-చెల్లిని తిట్టేందుకు ప్రత్యేక విభాగం ఉందని...దానికి ప్రధాన కార్యదర్శి ఎవరో తెలుసా?...అంటూ ప్రశ్నించిన పవన్ ఇంకెవరు బూతు జ్యోతి రత్న "ఆర్కే" అంటూ తానే సమాధానం ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయాన్నే ట్వీట్ల యుద్దం మొదలు పెట్టడంతో సోమవారం కూడా ఈ దాడి కొనసాగుతుందని అర్థమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+