Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అప్ డేట్: పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వెనక్కి...అసలు కారణం ఇదా?

విజయవాడ:పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని వెనక్కిపంపిన అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్ణించింది. ఉన్నట్టుండి పవన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఒక్కొక్కరు ఒక్కోరకం విశ్లేషణ చేస్తున్నారు.

అయితే లోతైన కారణాల సంగతి ఏమో కాని తాను సెక్యూరిటీని వెనక్కి పంపుతున్న కారణం పవన్ కళ్యాణే వివరించాడు కాబట్టి అది మాత్రం నిజమేనని అత్యధికులు భావిస్తున్నారు. అయితే తానే కోరి తెచ్చుకున్న ప్రభుత్వ భద్రతా సిబ్బందిని హఠాత్తుగా పవన్ కళ్యాణ్ తిప్పిపంపడం వెనుక లోలైన కారణం ఇదేనని తాజాగా మరో వాదన తెరమీదకు వచ్చింది. పైగా అందుకు కారణమైనవారే ఈ విషయాన్ని వెల్లడించారనే ప్రచారం జరుగుతుండటంతో ఇదే నిజమై ఉండొచ్చని వాదనకు బలం చేకూరుతోంది. ఇంతకూ ఏమిటా కారణమంటే?....

ఇటీవలే...పవన్ పై వివాదం

ఇటీవలే...పవన్ పై వివాదం

వారం కిందట పవన్ కళ్యాణ్ పై ఒక వివాదం చెలరేగి మీడియాలో హల్ చల్ చేసింది...జనసేనతో జట్టుకట్టాలని నిర్ణయించుకుని గత కొంతకాలంగా పవన్ తో లెఫ్ట్ పార్టీలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారం కిందట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు మరో ఇద్దరు నాయకులు జనసేన కార్యాలయానికి వెళ్లగా వీరిని కార్యాలయం లోపలికి వెళ్ళనీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని, లోపలికి అనుమతించే విషయమై తమకు సమాచారం ఏమీ రాలేదని అక్కడే ఆపేశారన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో గేటు బైట పావుగంట పైనే పడిగాపులు కాసిన ఆ వామపక్ష నేతలు ఆ తరువాత పవన్ నుంచి వాళ్లని లోపలకు పంపమన్న ఆదేశాలు రావడంతో లోపలకు పంపారట.

ఇంతవరకు అందరికీ తెలిసిందే...ఆ తరువాత

ఇంతవరకు అందరికీ తెలిసిందే...ఆ తరువాత

అయితే ఇలా సిపిఎం నేత మధును బైటే నిలబెట్టిన విషయం సిపిఎం మధుకు ఘోర అవమానం పేరుతో అన్ని మీడియాల్లో ప్రముఖంగా వార్తలు వెలువడి హల్ చల్ చేశాయి. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా పవన్ తన సెక్యూరిటీని సీరియస్ గా వెనక్కి పంపేంయాలని నిర్ణయించుకునేందుకు కారణమయ్యాయట. అయితే ఆ తరువాత జరిగిందంటే అలా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వదలడంతో జనసేన కార్యాలయం లోపలికి అడుగుపెట్టిన సిపిఎం మధుతో పాటు మరో ఇద్దరు వామపక్ష నేతలకు ఆ తరువాత లోపలకూడా తీవ్రమైన వెయిటింగ్ తప్పలేదట. కాకపోతే ఈ సారి వెయిటింగ్ బైట కాకుండా లోపల వేచిచూశారట.

ఈ విషయం కూడా...చేరింది

ఈ విషయం కూడా...చేరింది

అయితే ఇలా లోపల కూడా వెయిటింగ్ విషయం కూడా కొంతమంది అధికారపార్టీ నేతలకు సమాచారం తెలిసిపోయిందట. అలా ఆ విషయం మళ్లీ పవన్ శ్రేయోభిలాషుల ఫోన్ ద్వారా పవన్ కు తెలియడంతో ఆయన వెంటనే సిపిఎం నేతలను పిలిపించుకొని మాట్లాడారట. అంతకు రెండు రోజుల్లోనూ ఇలాంటివే చిన్న చిన్న ఘటనలు జరగడంతో సమాచారం ఎలా బైటకు వెళుతుందా అర్థం కాక పవన్ మథనపడ్డారట. సిపిఎం నేతల వ్యవహారంలో సమాచారం బైటకు పొక్కే విషయమై సెక్యూరిటీ సిబ్బందిపై అనుమానం వచ్చిన పవన్ ఇలా లీక్ అవుతోందనే భావనతో వారిని వెనక్కి పంపించాలని నిర్ణయించుకున్నారట.

మరి ఈ విషయం...ఎలా బైటకు వచ్చిందంటే...

మరి ఈ విషయం...ఎలా బైటకు వచ్చిందంటే...

మరి పవన్ సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపడానికి కారణం ఎలా బైటకు వచ్చిందంటే...ఎవరి కారణంగా సెక్యూరిటీని వెనక్కి తిప్పిపంపారో ఆ వామపక్ష నేతల ద్వారానే ఈ విషయం బైటకు తెలిసిందంటున్నారు. ఎందుకంటే తాము జనసేన కార్యాలయం వెలుపల, లోపల వేచి చూసిన విషయం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కి మాత్రమే తెలిసే అవకాశం ఉండటం, ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో సంభాషణలను బట్టి ఈ విషయంపై ఇటు పవన్ కు, అటు వామపక్ష నేతలకు స్పష్టత వచ్చిందట. కాబట్టే పవన్ ఇక ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించాడట. అందువల్లే ఇలా జరిగి ఉండొచ్చనే లీకు వామ పక్ష నేతలే ఇచ్చారంటున్నారు. సో మొత్తానికి ఈ వ్యవహారం అంతా చూస్తూ మొదట వీళ్ల లీకులు వాళ్లు ఇస్తే...చివరకు వాళ్ల లీకులు వీళ్లు ఇచ్చారని మీడియా వర్గాలు చర్చ జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+