ఉర్జీత్ పటేల్ పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ఉర్జీత్ పటేల్ పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం
అమరావతి: ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ డీమోనిటైజేషన్ పై స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా ఉర్జిత్ పటేల్, డీమోనిటైజేషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో బాలరాజు వంటి ఎందరో వ్యక్తులు బ్యాంకుల ముందు క్యూలైన్ లో మరణించడానికి ఉర్జిత్ పటేల్ అద్భుతమైన మేధోమధనం నుంచి ఉద్భవించిన డీమోనిటైజేషన్ అని విమర్శించారు. 69 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో మానవత్వంతో ఏ ప్రభుత్వమూ తీసుకునేందుకు సాహసించని నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుందని, సువిశాల భారత దేశంలో క్యాష్ లెస్ ఎకానమీ ఎలా సాధ్యమవుతుందో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications