'చంద్రబాబు కంటే కేసీఆర్ కు 2లక్షలు ఎక్కువ'
హైదరాబాద్/విజయవాడ : తెలంగాణ ఏపీ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాడ్డాక.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపైనే అందరి దృష్టి. పాలనలో అనుసరించే పంథా దగ్గరినుంచి రాజకీయ వ్యూహాల వరకు ఎవరు గొప్పంటే..? ఎవరు గొప్ప..? అన్న చర్చ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
ఈ విషయాలన్ని దృష్టిలోకి వచ్చినా..! రాకున్నా..! తమ పనేదో తాము చేసుకుంటు వెళిపోతున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. అయినా సరే ఇద్దరికీ ఓ పోలిక తెచ్చి.. ఇరువురి పేర్లను పక్కపక్కన బెడితే.. ఆ విషయం ఆటోమేటిగ్గా ప్రాధాన్యతను సంతరించుకోవడం ఖాయం. ఇదే తరహాలో ఇప్పుడు ఈ ఇద్దరు సీఎంల వేతన పోలిక హాట్ టాపిక్ గా మారింది.

వేతన వివరాలు :
ఏపీ సీఎం చంద్రబాబు వేతనం : రూ.2లక్షల 40వేలు
ఏపీ ఎమ్మెల్యేల వేతనం : రూ.లక్షా 25 వేలు
తెలంగాణ సీఎం వేతనం : రూ. 4క్షల 21 వేలు
తెలంగాణ ఎమ్మెల్యేల వేతనం : రూ.2లక్షల 5వేలు












Click it and Unblock the Notifications