మున్సిపాల్టీల ఏకగ్రీవాల వెనుక - షర్మిల కీలక వ్యాఖ్యలు..!!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పలు మున్సిపాల్టీలు ఏకగ్రీవం అయ్యాయి. మరో వైపు వైసీపీ సుప్రీంలో దాఖలు చేసిన కేసులో రేపు తదుపరి విచారణ కొనసాగనుంది. ఇటు ఎన్నికల సంఘం మిగిలిన మున్సిపాల్టీలతో పాటుగా కార్పోరేషన్లకు ఎన్నికల నిర్వహణకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ప్రకటించిన ఏకగ్రీవాల పైన పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. నామినేషన్ల ప్రారంభం వేళ చోటు జరిగిన ఘటనల పైన వైసీపీ సుప్రీం వరకు వెళ్లింది. సుప్రీం సూచనలతో ఎన్నికల సంఘం కొన్ని ప్రాంతా ల్లో రీ నామినేషన్ కు అవకాశం కల్పించింది. అయితే, తాము అడిగిన 19 మున్సిపాల్టీల్లో తిరిగి నామినేషన్లకు అవకాశం ఇవ్వలేదని వైసీపీ వాదిస్తోంది. రేపు (మంగళవారం) ఈ వ్యవహారం పైన సుప్రీంలో విచారణ జరగనుంది. కాగా.. కడప జిల్లాతో పాటుగా పలు చోట్ల ఏకగ్రీవాల ను ప్రకటన చేసారు. అయితే.. స్థానిక సంస్థల్లో జరుగుతున్నవి ఏకగ్రీవాలు కావు.. అధికార మదంతో కూటమి పార్టీలు చేసిన బలాత్కారాలని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఇవి ప్రజా ఆమోదం కాదు.. కూటమి పార్టీల అరాచకానికి నిదర్శనంగా అభివర్ణించారు.

Arnab Cyclone: విరుచుకుపడనున్న తుఫాను, ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..!!
Arnab Cyclone: విరుచుకుపడనున్న తుఫాను, ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..!!
pcc-chief-sharmila-slams-alliance-over-unanimous-municipal-election-wins-in-the-state

సుప్రీంకోర్టులో విచారణ పై ఉత్కంఠ

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కూటమి కమిషన్ గా మార్చి, నడిరోడ్డుపై రాజ్యాంగాన్ని ఖూనీ చేసి, పోలీసు వ్యవస్థను బానిసగా చేసి, కళ్ళముందే పత్రాలు చించేసారని మండిపడ్డారు. ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ, రక్తపాతంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఘనత కూటమి పార్టీలదేనని ఫైర్ అయ్యారు. ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసి, ప్రజల హక్కులను అపహాస్యం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. 16 మున్సిపాలిటీలు, 639 వార్డులు, 4 ZPTC లు , 32 ఎంపీటీసీల స్థానాల్లో జరిగినవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి పార్టీల భయోత్పాతానికి నిదర్శనంగా వివరించారు. ప్రభంజనం కాదిది.. కూటమి పార్టీల రాజకీయ నిస్తేజంగా షర్మిల వ్యాఖ్యానించారు. నాడు వైసీపీ చేసిందే.. నేడు మీరు చేస్తారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదా..బలవంతపు ఏకగ్రీవాల పేరుతో ఎందుకీ విచక్షణా రాహిత్యమని ప్రశ్నించారు. బలవంతపు ఏకగ్రీవాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+