ఎన్నికల వేళ షర్మిల కొత్త స్కెచ్ - ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయం..!!
ఎన్నికల వేళ ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పీసీసీ చీఫ్ గా పగ్గాలు స్వీకరించిన సమయం నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కొత్త వ్యూహానికి సిద్దమవుతున్నారు. బీజేపీతో సంబంధాలపై జగన్, చంద్రబాబు, పవన్ ను ప్రశ్నిస్తున్న షర్మిల..ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా తాజా ప్రణాళికలు సిద్దం చేసారు. ఏపీలో ప్రత్యర్ధి పార్టీలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
మారుతున్న లెక్కలు:ఏపీలో షర్మిల నిర్ణయాలు రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా గురించి పదే పదే ప్రశ్నిస్తున్న షర్మిల ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ప్రధాని మోదీ హామీ ఇవ్వకుండా మోసం చేసారనేది కాంగ్రెస్ తొలి నుంచి చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు దీనినే ఎన్నికల అస్త్రంగా మలచుకోవాలని నిర్ణయించింది. ఈ అంశం పైనే ఢిల్లీ కేంద్రంగా నిరసనలకు దిగాలని షర్మిల ఆలోచనగా సమాచారం. అందులో భాగంగా రేపు (ఫిబ్రవరి1 ) షర్మిలతో సహా ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరారు. కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్లు కోరారు.

ఢిల్లీ కేంద్రంగా నిరసనలు:కేంద్ర మంత్రుల వైఖరి పైన స్పష్టత వచ్చిన తరువాత అవసరమైతే ఢిల్లీలోనే నిరసనకు దిగాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. నిరసన దీక్షకు దిగాలనేది షర్మిల ఆలోచనగా చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ లోని వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు ఢిల్లీకి రావాలని సూచించారు. ఢిల్లీ కేంద్రంగానే ఏపీకి ప్రత్యేక హోదా అంశం పైన పోరాటం చేయాలని తాజా నిర్ణయంగా తెలుస్తోంది. ఇక, ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత 5న ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. తర్వాత గన్నవరం, విశాఖల్లో కూడా బహిరంగ సభలు చేపట్టాలని షర్మిల యోచిస్తున్నట్లు సమాచారం.
మేనిఫెస్టో పై చర్చలు:అటు కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీల హామీలు కాంగ్రెస్ కు అధికారం తెచ్చి పెట్టాయి. ఏపీలోనూ కొత్త హామీలతో ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మేనిఫెస్టో కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, జేడీ శీలం సహా 17మంది సభ్యులు హాజరయ్యారు. 10న బెంగళూరులో విస్తృత చర్చల అనంతరం మేనిఫెస్టో తయార చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమం పైన చర్చించి.. కొత్త హామీల రూపకల్పన పైన కమిటీ సభ్యులు కొత్త ప్రతిపాదనలతో ప్రజల ముందుకు రావాలని పార్టీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications