పండగ పూటా ఏడుపేనా..!? చంద్రబాబు ఏడుపుకు కారణాలివే-పెద్దిరెడ్డి ఫైర్..

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, పెద్దిరెడ్డికీ మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలో క్లీన్ స్వీప్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కుప్పంపై ఫోకస్ పెట్టిన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబును నిత్యం టార్గెట్ చేస్తున్నారు. దీంతో తరచుగా కుప్పంలో పర్యటిస్తూ చంద్రబాబు పెద్దిరెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇవాళ నారావారిపల్లెలో పర్యటిస్తున్న చంద్రబాబు జీవో నంబర్ 1ను తగులబెట్టి వైసీపీ సర్కార్ పై చేసిన విమర్శలకు పెద్దిరెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి పెద్దిరెడ్డి .. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగు వారు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ నాడు కూడా.. నీచ రాజకీయాలు చేస్తూ.. మా మీద పడి ఏడుస్తున్నాడని పెద్దిరెడ్డి మండిపడ్డారు. పండుగ పూట బాబు స్వగ్రామం నారావారిపల్లె వచ్చి, నన్నే గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలు, మానిప్యులేషన్లనే నమ్ముకున్న చంద్రబాబుకు ఎప్పుడూ ఏడుపే తప్ప సంతోషం ఉండదన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ టీడీపీ జెండా పీకేయడం ఖాయం అని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు.

వైఎస్ కాంగ్రెస్ లో ఏకైక నాయకుడు కాబట్టి ఇంతకు ముందు ఆయనపై పడి ఏడ్చేవాడని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పైనా, ఆ తర్వాత మంత్రి వర్గ సహచరులపైన ఏడుస్తున్నాడని చంద్రబాబునుద్దేశించి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఏడుపుకి కారణం చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ మెజార్టీ సాధించలేకపోవడమేనన్నారు. మరోవైపు అధికారం పోయిందనే బాధ అన్నారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కూడా ఆ పార్టీ జెండా పీకేసెలా ప్రజలు ఉన్నారనే ఆయన బాధఅంతా అన్నారు. ఈ బాధలన్నీ గుర్తొచ్చి తమపై ఏడుస్తున్నాడని పెద్దిరెడ్డి తెలిపారు. ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డిగారిని నోటికొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నాడన్నారు.

peddireddy ramachandrareddy slams chandrababu for his foul crying even on pongal

చంద్రబాబు చిత్తూరు జిల్లాకు ఏం చేశాడు అంటే చెప్పుకోవడానికి ఒక్క మేలు కూడా లేదన్నారు. ఈ జిల్లా వాసి కాకపోయినా జగన్ బాధ్యతగల ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమంగా చూస్తూ అభివృద్ధి చేస్తున్నారని, ఆఖరికి కుప్పానికి కూడా ఎంతో చేశారన్నారు. కుప్పం మున్సిపాల్టీ అయితేనేమీ, రెవెన్యూ డివిజన్ చేయడం.. ఇవన్నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడన్నారు. చిత్తూరు జిల్లా అభివృద్ధి విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అడిగినవన్నీ సీఎం మంజూరు చేస్తున్నారని, చంద్రబాబు, చిత్తూరు జిల్లాకు ఏం చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

పుంగనూరులో కేసులు పెట్టమని మాట్లాడుతున్నారని, పుంగనూరు లో రౌడీయిజం చేస్తే లా అండ్ ఆర్డర్ పోలీసులు మెయింటైన్ చేయకూడదా ?. అని ప్రశ్నించారు. మీ రౌడీలు, గూండాలు గొడవలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా ? అన్నారు. మీ కార్యకర్తలు అరాచకాలు చేస్తే .. బాధితులు గాయపడి ఆసుపత్రుల్లో ఉన్నారని, మీ ఇష్టానికి వదిలేస్తే పోలీసులు, ప్రభుత్వం మంచిదా, లేకపోతే పుంగనూరులో అరాచకం చేస్తున్నామని మాపైన దుష్ప్రచారం చేస్తారా. ? అని అడిగారు.

చంద్రబాబుకు క్యారెక్టర్ లేదు. కానీ, ఆయన మాత్రం మిగతా అందర్నీ వ్యక్తిత్వ హననానికి పాల్పడతాడు. టీడీపీ హయాంలో మా మీద అక్రమంగా కేసులు పెట్టి, ఎంపి మిథున్ రెడ్డిని కూడా జైలులో పెట్టారన్నారు. పుంగనూరు లో అభివృద్ధి అడ్డుకున్నారన్నారు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారే మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు కూడా, ఈరోజు లాగే ఎడుస్తుంటావ్ చంద్రబాబూ అని అడిగారు. చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టాడే కానీ, ఈ జిల్లాలో ఉండడు, ఈ జిల్లాకోసం ఏమీ చేయడు. అతను ఒక వలస పక్షి లా తిరుగుతుంటాడన్నారు. సొంత జిల్లా పై బాబుకు ఏ మాత్రం ప్రేమ లేదని, ఆఖరికి హత్య రాజకీయాలు కూడా మొదలు పెట్టింది చంద్రబాబేనన్నారు.

కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగాను చంపించింది ఎవరని ప్రశ్నించారు. నువ్వు కాదా బాబూ ? పింగళి దశరధరామ్ ను ఎవరు చంపారన్నారు. గోదావరి పుష్కరాల్లో నీ షూటింగ్ కోసం 29 మందిని చంపావ్, మొన్న కందుకూరు లో 8 మందిని, గుంటూరు లో ముగ్గురిని చంపావ్ అన్నారు. ప్రజలను చంపి మళ్ళీ వారిపైనే రాజకీయాలు చేస్తున్నావ్. వాటన్నింటినీ చంద్రబాబు చేసిన హత్యలు గా పరిగణించాలన్నారు. నువ్వు రోడ్ల మీద, ఇరుకు సందుల్లో సభలు పెట్టి జనాన్ని చంపుతుంటే... జీఓ నంబర్ 1 ను తీసుకొచ్చారని, ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండే జీఓ ను భోగిమంటల్లో కాలుస్తారా..?. అంటే ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా.? అని అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+