జగన్ చెప్తే, హోదా కోసం రాజీనామాకు సిద్ధం: పెద్దిరెడ్డి
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని, తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధమని వైసిపి నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు.
చిత్తూరు: ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని, తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధమని వైసిపి నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. తమకు రాజకీయ ప్రయోజనాలు కాదని, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేశారన్నారు.

దాని వల్ల ఏం లాభం వచ్చిందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎంతో లబ్ధి చేకూరి ఉండేదన్నారు. ప్యాకేజీ వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు. శాంతియుతంగా చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ పట్ల ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
కేసుల భయం వల్లే చంద్రబాబు హైదరాబాదును వీడి అమరావతికి మకాం మార్చారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications