రోజాను పోటీ చేయనివ్వొద్దు: చేతులెత్తి మొక్కిన మంత్రి పీతల సుజాత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా పైన పోటీ చేయకుండా మంత్రి పీతల సుజాత మంగళవారం శాసన సభలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే అనిత పైన రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమె పైన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు చేతిలెత్తి విజ్ఞప్తి చేశారు.
రోజా గతంలోను తన పైన, ఇతరుల పైన చాలా జుగుప్సాకరంగా మాట్లాడారని, ఆమె తీరు తనను తీవ్రంగా బాధించిందని పీతల సుజాత అన్నారు. మనం చట్ట సభలకు వచ్చింది ప్రజల సమస్యలను పరిష్కరించేందుకని, కానీ సభ్యులు ఇష్టారీతిగా మాట్లాడేందుకు కాదన్నారు.
రోజా వ్యాఖ్యలు ఎవరినైనా తీవ్ర ఆవేదనకు గురి చేస్తాయన్నారు. రోజా మాటలు చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించడం ఏమిటనే విధంగా ఉందన్నారు. రోజా మహిళ అనే మరిచిపోయి ఇష్టారీతిన మాట్లాడుతోందని, రౌడీలా మాట్లాడుతోందన్నారు.

అంబేడ్కర్ వల్లే తమ వంటి దళితులం అసెంబ్లీలో అడుగు పెట్టామని, అలాంటి తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. రోజా వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. నిన్న తనను (పీతల సుజాత), ఇవాళ అనితను రోజా తిట్టారని, రేపు మరొకరిని కూడా అంటారన్నారు.
అలాంటి మహిళను ప్రతిపక్ష నేత జగన్ వెనుకేసుకు రావడం విడ్డూరమన్నారు. రాబోయే రోజుల్లో ఏ మహిళ కూడా ఇలా మాట్లాడకుండా ఉండేందుకు రోజా పైన కఠిన చర్యలు తీసుకోవాలని పీతల సుజాత విజ్ఞప్తి చేశారు. తాను చేతులు జోడించి సభాపతిని అడుగుతున్నానని... రోజా దళితులను అవమానిస్తున్నారని, రోజా పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications