కారు ప్రమాదం: 'పెళ్లి పుస్తకం' నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెళ్లి పుస్తకం సినిమా నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం పాలయ్యారు. దర్శకుడు మదన్ గాయపడ్డారు. దర్శకుడు మదన్‌తో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి మరణించగా, మదన్ గాయపడ్డారు.

తీవ్రంగా గాయాల పాలైన నాగిరెడ్డిని తొలుత గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శంషాబాద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మదన్ పెళ్లయిన కొత్తలో సినిమాకు దర్శకత్వం వహించారు. వీరిద్దరు అనంతపురం నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మదన్ గచ్చిబౌలిలోని హిమగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications