ఫస్ట్ వచ్చింది, పెన్షన్ రాలేదు - కారణం ఎవరు..!!

ఏపీలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. వాలంటీర్ల పై ఫిర్యాదులు నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ విధుల నుంచి వారిని ఎన్నికల సంఘం పక్కనపెట్టింది. ఇదే ఇప్పుడు లబ్ధిదారులకు సమస్యగా మారింది. ప్రతినెల 1వ తేదీ ఉదయం అందే పెన్షన్లు ఎన్నికల కోడ్ పూర్తయ్య వరకు ఆలస్యం అవుతుందని సమాచారంతో లబ్ధిదారులంతా ఆగ్రహంతో కనిపిస్తున్నారు. కారకులైన వారి పైన మండిపడుతున్నారు.

అందని పెన్షన్
ప్రతినెల 1వ తేదీ ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 66 లక్షల మంది లబ్ధిదారులకు వాలంటీర్లు వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించడం గత ఐదేళ్ల కాలంగా జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్ల పైన ఆంక్షలు విధించింది. పెన్షన్ పంపిణీ విధుల నుంచి వాలంటీర్లను తప్పించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించింది. దీంతో లబ్ధిదారులు సమీప వార్డు, గ్రామ సచివాలయాల్లో పెన్షన్ తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై లబ్ధిదారుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

Pension Beneficiaries angry over the oppostion leaders for impoising restrictions on distribution system

కారణం ఎవరు
పెన్షన్ ప్రతినెల 1వ తేదీ వాలంటీర్లు ఇంటికి వెళ్లి అందజేసే విధానం మొదలుపెట్టారు. కానీ, ఇప్పుడు వాలంటీర్లను తప్పించడంతో ఈ రోజున అందాల్సిన పెన్షన్లు లబ్ధిదారులకు అందలేదు. ఈనెల మూడో తేదీన లబ్ధిదారులు తమ గుర్తింపు కార్డులతో సమీపంలోని సచివాలయంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి ముందుకు వచ్చే పెన్షన్ ఆపించి.. ఇప్పుడు తమను సచివాలయాల చుట్టూ తిప్పటం ఏంటని లబ్ధిదారులు ఆగ్రహంతో ఉన్నారు. తమకు అందే పెన్షన్లు అందకుండా అడ్డుకున్నారంటూ ప్రతిపక్ష నేతల మీద మండిపడుతున్నారు. వైసీపీ నేతలు ఈ మొత్తం చంద్రబాబు మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే జరుగుతోందని మండిపడుతున్నారు.

లబ్దిదారుల ఆగ్రహం
సామాన్యులతో చంద్రబాబు అండ్ టీం ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం కావటంతో ఈరోజు బ్యాంకులు సెలవని, రేపు నగదు విత్ డ్రా చేసి మూడో తేదీన సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ఇదేవిధంగా సచివాలయాల్లోనే లబ్ధిదారులు పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులు ప్రస్తుతం ప్రతిపక్షాల పైన ఆగ్రహంతో ఉన్నారు. వారి కారణంగానే తమ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ధ్వజమెత్తుతున్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+