తవ్వేకొద్దీ: కళ్లు చెదిరే అటెండర్ ఆస్తులు, ఎమ్మెల్యే అభ్యర్థులకే అప్పులు

నెల్లూరు: నెల్లూరు ఆర్టీఏ కార్యాలయంలో అటెండర్ నర్సింహా రెడ్డి ఆస్తులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బుధవారం ఓ సహకార బ్యాంకులో ఆయనకు చెందిన లాకర్‌లో అధికారులు 2.5 కిలోల బంగారాన్ని గుర్తించారు. ఆయన ఆస్తులు రూ.100 కోట్ల వరకు ఉంటాయని భావిస్తున్నారు. నరసింహా రెడ్డి ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే.

ఆయన ఏకంగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అభ్యర్థులకు వడ్డీకి అప్పులిచ్చే సంపాదన కూడబెట్టాడు. తనకు వచ్చిన ప్రమోషన్లను కాదని అటెండర్‌గా ఉంటూ సంపాదన కూడబెట్టాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పేర తక్కువ ఉంచుకొని భార్య పేరిట ఎక్కువ ఉంచాడు.

 తవ్వేకొద్ది బయటపడిన ఆస్తులు

తవ్వేకొద్ది బయటపడిన ఆస్తులు

మంగళారం నాడు ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆరుచోట్ల తనిఖీలు నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారు. తవ్వేకొద్ది ఆస్తులు బయటపడ్డాయి. వ్యవసాయ భూములు, ప్లాట్లు, బంగారం, వెండి, ఆభరణాలు, డిపాజిట్లు వెలుగు చూశాయి. బహిరంగ మార్కెట్లో ఆస్తి విలువ రూ.80 కోట్లకు పైగా ఉంటుందని గుర్తించారు.

ఎమ్మెల్యే అభ్యర్థులకు వడ్డీకి డబ్బులు

ఎమ్మెల్యే అభ్యర్థులకు వడ్డీకి డబ్బులు

50.36 ఎకరాల వ్యవసాయ భూములు, పద్దెనిమితి ఇళ్లు, బిల్డింగులు, బంగారం, బ్యాంకులోన్, ఇంట్లోను నగదు నిల్వలు, రూ.1.01 కోట్ల విలువైన ఎల్‌ఐసీ డిపాజిట్లు బయటపడ్డాయి. ఎల్‌ఐసీ పాలసీలకు రూ.10 లక్షల ప్రీమియం ఉంది. ఓ చిన్న ఉద్యోగి వద్ద కోట్లు బయటపడటం ఇదే తొలిసారి అని అంటున్నారు. 1984లో అతను రవాణా శాఖలో చేరాడు. ఇప్పటి వరకు అతను పలుమార్లు ప్రమోషన్ పొందాలి. కానీ నిరాకరించాడు. ఎమ్మెల్యే అభ్యర్థులకు వడ్డీకి అప్పులిచ్చాడు. దీంతో అతనిని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు.

భార్య పేరిటే ఎక్కువ ఆస్తులు

భార్య పేరిటే ఎక్కువ ఆస్తులు

నెల్లూరులోలోని గుండిపాలెంలో 1992లోనే భూమిని కొనుగోలు చేశాడు. భార్య హరిప్రియ పేరిట భారీ సంఖ్యలో స్తిరాస్తులు ఉన్నాయి. నెల్లూరులోనే పలు చోట్ల స్తిరాస్తులు, భూములు కొనుగోలు చేశాడు. భార్య కుమార్తె పేరిట ఉన్న లాకర్‌ను అధికారులు తెరవనున్నారు.

 కార్పోరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు అప్పులు

కార్పోరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు అప్పులు

ఆయన నెల్లూరులో కార్పోరేటర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు చాలామందికి ఎన్నికల సమయంలో వడ్డీకి అప్పులు ఇచ్చేవాడని చెబుతున్నారు. ఆ వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. 34 ఏళ్ల సర్వీసులో అతను కోట్లాది రూపాయలు సంపాదించాడు. కాగా, ఏసీబీ అధికారులు బినామీ వ్యవహారంపై కూడా ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+