పవన్ కల్యాణ్ పిఠాపురం, ఇది అసలు కథ, కావాలంటే చెక్ చేసుకోండి, వైసీపీ ??
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించిన పిఠాపురంలో పండగ వాతావరణం నెలకొనింది.
చంద్రబాబు అడ్డా కుప్పం అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇక పవన్ కల్యాణ్ కు రాజకీయ భిక్ష పెట్టిన పిఠాపురం గురించి నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వారు నివాసం ఉంటున్న దేశ, విదేశాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ముఖ్యంగా పిఠాపురం ప్రజలు బుధవారం పండుగ చేసుకుంటున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు ఓటు వేసిన ప్రతి ఇంటిలో ఈ రోజు తీపి పదార్థాలు వండుకుని అందరితో కలిసి హ్యాపీగా గడుపుతున్నారు.

పిఠాపురంలో వంగా గీత కోసం పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే అవమానంగా బావించి దాక్కోని దాక్కోని తిరుగుతున్నారని తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిపించి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పిఠాపురం ప్రజలకు ఏం చెయ్యాలి అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు గుర్తింపు తెచ్చిన నియోజక వర్గంగా పిఠాపురం చరిత్రలో నిలిచిపోతుంది.
పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే వంగా గీతా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వంగా గీతా అంటూ కార్లు, బైక్ లకు స్టిక్కర్లు వేసుకుని తిరిగిన వైసీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తల అడ్రస్ గల్లంతు అయ్యింది. ఇక పిఠాపురానికి పవన్ కల్యాణ్ ఏం న్యాయం చేస్తాడు ?, ఆ నియోజక వర్గం ప్రజలను ఎలా ఆదుకుంటారు ? అనే ప్రశ్న తెలుగు వారు నివాసం ఉంటున్న ప్రతి చోటా చర్చ జరుగుతోంది. మాకు ఇక మంచి రోజులు మొదలైనాయని పిఠాపురం ప్రజలు జోరుగా సంబరాలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications