ఈసారి బటన్ గట్టిగా నొక్కిన జగన్, ఫ్యాన్ స్విచ్ పగిలిపోయింది, పాపం ఏం చేద్దామ్ !!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది. ఓటరు చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధం బాగా పని చేసినట్లు ఉంది, ఇంతకాలం చంకలు గుద్దుకున్న వైసీపీ నాయకులకు అదే సంరలే వాచిపోయేలా ఓటర్లు బుద్దిచెప్పారని ప్రజలు అంటున్నారు. వార్ వన్ సైడ్ అన్నారు, నిజంగానే ప్రజలు వార్ వన్ సైడ్ చూపించారు.

నేను బటన్ నొక్కుతున్నా, ప్రతినెల మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, మీరు ఓటు వేసేదే ఆలస్యం అని జగన్ ఇంతకాలం చెప్పారు. గతంలో నేను మహిళలకు చేసినంత న్యాయం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ సీఎం కాని, ఏ ప్రభుత్వాం కాని చెయ్యలేదని జగన్ చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈసారి బటన్ గట్టిగా నొక్కడంతో ఫ్యాన్ స్విచ్ పగిలిపోయింది అంటున్నారు సామాన్య ప్రజలు.

People say that there are many reasons why the YCP government lost in Andhra Pradesh

తాను సీఎం అయిన తరువాత బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో రెండున్నర లక్షల రూపాయలు డబ్బులు వేశానని ఇంతకాలం వైఎస్ జగన్ ప్రతి మీటింగ్ లోను చెప్పుకున్నారు. అయితే మహిళల అకౌంట్ లో పావల డబ్బులు వేసిన జగన్ అదే మహిళ భర్త జోబులో నుంచి రెండు రూపాయలు లాగేస్తున్నారని సామాన్య ప్రజలు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారని ప్రజలు అంటున్నారు.

వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అంతమాత్రమే వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులతో వేసిన జాతీయ రహదారులు మేమే వేశామని చెప్పుకున్న వైసీపీ బండారాన్ని ప్రజలు ఆలస్యంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత ఎలాంటి పనులు జరిగాయి, ప్రజలకు ఎంత మేలు జరిగింది, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంత ఆధాయం ఉంది అని ఓటర్లు ఆలోచించారు.

వైసీపీ నాయకుల బెదిరింపులు, వారి అరాచకాలు ఇంతకాలం సహించిన సామాన్య ప్రజలు పోలింగ్ ముందు రోజు వరకు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. పోలింగ్ రోజు కూడా మేము వైసీపీకి ఓటు వేశామని సామాన్య ప్రజలు వైసీపీ నాయకులకు చెప్పారు. అయితే ఆ రోజు సామాన్య ప్రజలు వైసీపీ ఆగడాలకు భయపడి అసలు మ్యాటర్ బయటకు చెప్పలేదని, వైసీపీ నాయకులకు బుద్ది చెప్పడానికి కూటమి అభ్యర్థులకు సైలెంట్ గా ఓట్లు వేసేశారని, అందుకే జగనన్న ఇంటకి వెళ్లిపోతున్నారని ఇప్పుడు సామాన్య ప్రజలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+