నగిరిలో సైలెంట్ ఆపరేషన్, ఓటు వేసి డీసెంట్ గా వెళ్లిపోతున్న ప్రజలు, మ్యాటర్ మాత్రం ?
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు సైతం లెక్క చెయ్యకుండా పోలింగ్ కేంద్రలకు వెళ్లి ఓటు వెయ్యడానికి అన్ని వర్గాల ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలు ఓపికగా క్యూలో నిలబడి ఓటు వెయ్యడానికి పోటీపడుతున్నారు. మంత్రి రోజా పోటీ చేస్తున్న నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈసారి మహిళలు, యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
నగిరిలో అతి తక్కువ మెజారిటీతో ఎమ్యెల్యేగా విజయం సాధించిన మంత్రి ఆర్ కే రోజాకు వైసీపీ మరోసారి టిక్కెట్ ఇచ్చింది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల వ్యతిరేకత ఉన్నా వైసీపీ హైకమాండ్ మరోసారి రోజాకు టిక్కెట్ ఇవ్వడంతో ఆమె ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే మంత్రి రోజా గెలుపు ఓటములపై గత కొంతకాలంగా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మంత్రి రోజా మీద పోటీగా టీడీపీ నాయకుడు గాలి భానుప్రకాష్ రంగంలో దిగారు.నగిరిలో చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. నాయకుల మద్య ఏకాభిప్రాయం లేకపోయినా మంత్రి రోజా మంత్రి గెలుపునాదే అంటూ ధీమాగా ఇంతకాలం ఎన్నికల ప్రచారం చేశారు. సోమవారం ఉదయం నుంచి నగిరి అసెంబ్లీ నియోజక వర్గంతో పాటు పుత్తూరు పట్టణంతో పాటు ఐదు మండలాల్లో ఓటు వెయ్యడానికి ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
నగిరిలో టీడీపీ, వైసీపీ నాయకుల హంగామా ఎక్కువగానే ఉన్నా అక్కడ సీన్ మాత్రం మరో రకంగా ఉంది. ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు వెలుతున్న నగిరి నియోజక వర్గం ప్రజలు సైలెంట్ గా ఓటు వేసి అంతే సైలెంట్ గా వెళ్లిపోతున్నారు. ఓటు వేసిన తరువాత వారికి అనుకూలంగా ఉన్న నాయకులతో మాట్లాడటానికి ఓటర్లు ఎక్కువ ఆసక్తి చూపించడం లేదని తెలిసింది.
నగిరిలో ఓటరు నాడి తెలుసుకోవడానికి వైసీపీ, టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఓటర్లు మాత్రం వారు ఎవరికి ఓటు వేశారు ?, ఈసారి ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనే మ్యాటర్ బయటకురావడం లేదని తెలిసింది. గతంలో రెండుసార్లు తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యే అయిన రోజా తరువాత మంత్రి కూడా అయ్యారు. మూడోసారి విజయం తనదే, హ్యాట్రిక్ గ్యారెంటీ అని మంత్రి రోజా ధీమాగా ఉన్నారు. అయితే ఈసారి గెలుపునాదే అంటూ టీడీపీ నాయకుడు గాలి భానుప్రకాష్ అంతే ధీమాగా ఉన్నారు.












Click it and Unblock the Notifications