పెప్పర్ స్ప్రే ఎకె 47 అనుకుంటున్నారా: సోమిరెడ్డి

శాసనసభను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు అడ్డుకోలేదా, తమ హక్కుల కోసం పార్లమెంటు సమావేశాలను పార్లమెంటు సభ్యులు అడ్డుకుంటే తప్పా అని ఆయన అడిగారు. సభలో పార్లమెంటు సభ్యులకు నిరసన తెలిపే హక్కు లేదా అని అయన అడిగారు. గాంధీ కుటుంబానికి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆయన అన్నారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ బయట ఉండి సభలో ఎంపీలపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. చట్టాలు తేవాల్సినవాళ్లు సభలో గుండాల్లా వ్యవహరిస్తారా, సభలో గుండాయిజం చేస్తారా అని ఆయన అడిగారు. తమ హక్కుల గురించి అడిగితే దాడులు చేస్తారా అని ఆయన అడిగారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణకు ఏమైనా జరిగితే సోనియా గాంధీదే బాధ్యత అని ఆయన అన్నారు.
సీమాంధ్రకు న్యాయం చేయడం లేదని, ఆ విషయం అడిగితే తప్పెట్లా అవుతుందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎంతో దూరం లేవని, ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అనుభవించాల్సి వస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications