పవన్ కు ఆ ధైర్యం ఉందా, చంద్రబాబును మించిపోయారు - పేర్ని నాని..!!
చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు 2020 విజన్ ఏమైందని ప్రశ్నించారు. అటకెక్కిందా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు విజనరీ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయాడని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లకు తాళం వేయడమే చంద్రబాబు విజన్ అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు మోసగాడు అయితే పవన్ కళ్యాణ్ గజ మోసగాడని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు విశాఖ కేంద్రంగా ప్రకటించిన విజన్ 2047 పై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో విజన్ 2020 అన్నారు..ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని ఎద్దేవా చేసారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల నుంచి డబ్బులు వసూలు చేయడం బాబు దిక్కుమాలిన విజన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన ఘనుడు చంద్రబాబు..విజన్ పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకు విజన్ ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అంటే గుర్తుకు వచ్చేది పబ్లిసిటి మాత్రమేనని చెప్పుకొచ్చారు. విజన్ పబ్లిసిటి చంద్రబాబు పథకంగా పేర్ని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల నుంచి డబ్బులు వసూలు చేయడం బాబు దిక్కుమాలిన విజన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ సినిమా, సీరియల్ టైటిల్స్ పెడతారని ఎద్దేవా చేసారు. సినిమా కవులు పెట్టిన పేరు ప్రజా కోర్టుగా పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వల్ల ఏం ఒరిగిందని ప్రశ్నించారు. ఒక టీ షాప్ వ్యక్తి ఇచ్చిన డబ్బులతో లారీ కొని వారాహి అని పేరు పెట్టారని చెప్పుకొచ్చారు. ఈ మోసాలు ఎందుకని నిలదీసారు. ఎన్ని స్థానాలకు పోటీ చేస్తాడో దమ్ముంటే చెప్పాలని డిమాండ్ చేసారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే ఆ విషయం ధైర్యంగా చెప్పగలరా అని నిలదీసారు. నిజాయితీగా, నిఖార్సుగా ఓట్లు అడుక్కోలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ దని ఎద్దేవా చేసారు. విద్యుత్ చార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన ఘనుడు చంద్రబాబు..విజన్ పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకు విజన్ ఉందా అని ప్రశ్నించారు.
విద్యపై చంద్రబాబుకు దర్శనికత ఎక్కడ ఉందని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీని ప్రపంచ పటంలో పెడతానని కాలజ్ఞానం చెబుతున్నారని ఎద్దేవా చేసారు. టీడీపీకి అధికారం ఇస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెబుతున్నారని చెప్పుకొచ్చారు. నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్లను చూసి మురిసిపోయారు తప్ప ఒక్క గవర్నమెంట్ స్కూల్ అయినా కన్నెత్తి చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అక్షరాస్యతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరన నిలిచిందని గుర్తు చేసారు. హెల్త్ పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్ ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ చంద్రబాబుది కాదు, ఇది వైయస్‌ఆర్ విజన్ గా గుర్తు చేసారు. విజన్ 202 అడ్రస్ లేకుండా పోయిందని, ఇవాళ 2047 మొదలుపెట్టారని పేర్ని నాని ఎద్దేవా చేసారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications