జనసైనికుల ముట్టడి - పేర్ని నాని మాస్ వార్నింగ్..!!

మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిని జనసైనికులు ముట్టడించారు. తిరుమల లడ్డూ వివాదంలో పవన్ చేసిన వ్యాఖ్యల పైన పేర్ని నాని తాజాగా స్పందించారు.భీమవరంలో బాప్టిజం తీసుకున్నారని చెప్పిన పవన్ ఆయనేనా? అంటూ నాని ప్రశ్నించారు. పొరపాట్లు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని వ్యాఖ్యా నించారు. దీనికి నిరసనగా జనసైనికులు నాని ఇంటిని ముట్టడించారు. దీంతో, నాని హెచ్చరిక చేసారు.

జనసైనికులు పేర్ని నాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. తాజాగా పవన్ ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల పట్ల వారు నిరసన చేపట్టారు. మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి వద్ద ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ...దిష్టిబొమ్మ దగ్దానికి ప్రయత్నించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని వారించారు. ఉద్రిక్తత ఏర్పడటంతో అక్కడ నుంచి వారిని పంపేసారు. అయితే, పవన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని జనసైనికులు నినదించారు.

Perni Nani warns Janasena activists who protests at his Residence in Machilipatnam

తన ఇంటి ముట్టడికి జనసైనికులు రావటం పైన పేర్ని నాని సీరియస్ అయ్యారు. తమ ఇంటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమూ..వాళ్ల ఇంటికి తమ ఇల్లు అంతే దూరమని గుర్తించాలని సూచించారు. సినిమా షూటింగ్స్ తరహాలో రాజకీయాల్లో చేయాలంటే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కులం, మతం లేదని పార్టీ స్థాపించిన పవన్ ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఇతర మతాలను ప్రస్తావిస్తూ హిందువుల బయటకు రారా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదే విధంగా రాజకీయం చేస్తే తాము సిద్దమని పేర్ని నాని స్పష్టం చేసారు. ఇలాంటి బెదిరింపులకు వైసీపీ కేడర్, తాము భయపడేది లేదన్నారు. పోలీసులు ఇలాంటివి చూస్తూ కూర్చొంటే మచిలీపట్నంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని పేర్ని నాని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+