వాలంటీర్లకు బిగ్ షాక్
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్ల చూట్టునే తిరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.వాలంటీర్ల అంతా కూడా వైసీపీ సానుభూతిపరులే అని టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేశారు. ఈక్రమంలో ఎన్నికల విధుల నుంచి వారిని తొలగించాలని ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల సంఘానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద యుద్దమే నడించింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటరిచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10,000 చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. అయినప్పటికి కూడా కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థపై అనేక అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి.

గ్రామానికి కేవలం 5 మంది వాలంటీర్లను మాత్రమే తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విధి, విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన చేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇటువంటి వేళ వాలంటీర్లకు వేళ ఊహించని షాక్ తగిలింది. వాలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. దీంతో వాలంటీర్లపై ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు వచ్చే నెల పెన్షన్లను వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో వాలంటీర్లు తమను ఎక్కడ శాశ్వతంగా తొలగిస్తారో అని ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications