ఫైలిన్: కూకటివేళ్లతో కూలిన చెట్లు, హెచ్చరిక (పిక్చర్స్)
హైదరాబాద్: ఫైలిన్ తుఫాను అల్లకల్లోలం సృష్టించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన భయానక తుఫాను తీరప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో కూకటివేళ్లతో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. శ్రీకాకుళం, ఒరిస్సా రాష్ట్రాలపై అధిక ప్రభావం పడింది.
శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. విజయనగరం, విశాఖపట్నం పైన ఫైలిన్ ప్రభావం పడింది. ఫైలిన్ తుఫాను నేపథ్యంలో తీర ప్రాంత వాసులను అధికారులు ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు.
మరోవైపు ఫైలిన్ కారణంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లలో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరింది. తుఫాన ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. సాధ్యమైనంత యాథాస్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఫైలిన్ 1
ఫైలిన్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా కవిటి మనండలంలో విరిగిపడిన చెట్లు. మన రాష్ట్రంలో ఫైలిన్ తుఫాను కారణంగా ఎక్కువగా దెబ్బతింది శ్రీకాకుళం జిల్లానే.

ఫైలిన్ 2
ఫైలిన్ తుఫాను కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు కవిటి మండలంలోని బోరివంక గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన దృశ్యం.

ఫైలిన్ 3
ఫైలిన్ తుఫాను కారణంగా కవిటి మనండలంలో విరిగిపడిన చెట్లు. మన రాష్ట్రంలో ఫైలిన్ తుఫాను కారణంగా ఎక్కువగా దెబ్బతింది శ్రీకాకుళం జిల్లానే.

ఫైలిన్ 4
ఫైలిన్ తుఫాను కారణంగా కవిటి మండలంలోని డి.గొనగపుట్టుగ గ్రామంలో విరిగిపడిన చెట్లు. విద్యుత్ వైర్ల పైన చెట్టు పడిన దృశ్యం.

ఫైలిన్ 5
ఫైలిన్ తుఫాను కారణంగా సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను, ఇతరులను పడవలో సురక్షిత ప్రాంతానికి తీసుకు వస్తున్న దృశ్యం.

ఫైలిన్ 6
ఫైలిన్ తుఫాను కారణంగా దెబ్బతిన్న రోడ్ల దృశ్యం. మన రాష్ట్రంలో ఫైలిన్ తుఫాను కారణంగా ఎక్కువగా దెబ్బతింది శ్రీకాకుళం జిల్లానే.

ఫైలిన్ 7
ఫైలిన్ తుఫాను కారణంగా కవిటి మండలంలోని డి.గొనగపుట్టుగ గ్రామంలో విరిగిపడిన చెట్లు. కవిటి మండలంలో ఓ ఇంటి పైన చెట్టు పడిన దృశ్యం.

ఫైలిన్ 8
పైలిన్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలోని ఓ గ్రామంలో కూకటి వేళ్లతో సహా కూలిపోయిన ఓ కొబ్బరి చెట్టు.

ఫైలిన్ 9
పైలిన్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలోని ఓ గ్రామంలో కొబ్బరి చెట్లు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. తొలగిస్తున్న గ్రామస్తులు.

ఫైలిన్ 11
ఫైలిన్ తుఫాను కారణంగా సముద్రతీరంలో దెబ్బతిన్న దృశ్యం. మన రాష్ట్రంలో ఫైలిన్ తుఫాను కారణంగా ఎక్కువగా దెబ్బతింది శ్రీకాకుళం జిల్లా. విశాఖ జిల్లా పైన ప్రభావం పడింది.

ఫైలిన్ 10
పైలిన్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలోని ఓ గ్రామంలో మొక్కజోన్న పంట పూర్తిగా ఒరిగిపోయిన దృశ్యం.

ఫైలిన్ 12
ఫైలిన్ తుఫాను కారణంగా సముద్రతీరంలో దెబ్బతిన్న దృశ్యం. మన రాష్ట్రంలో ఫైలిన్ తుఫాను ప్రభావం విశాఖ జిల్లా పైన కూడా పడింది.

ఫైలిన్ 13
అపాయము లోనికి ప్రవేశించుట నిషేధము అని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ సముద్ర తీరంలో హెచ్చరిక బోర్డును ఉంచింది.

ఫైలిన్ 14
ఫైలిన్ తుఫాను కారణంగా విశాఖపట్నంలోని సముద్ర తీరం ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్న దృశ్యం. విశాఖపైన ఫైలిన్ ప్రభాం పడింది.

ఫైలిన్ 15
ఫైలిన్ తుఫాను కారణంగా విశాఖలో సముద్ర తీర ప్రాంతంలో కొట్టుకుపోయిన ఒడ్డు. సముద్రంలోకి ఎవరు వెళ్లకుండా రక్షణగా కర్రలు కట్టిన దృశ్యం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications