ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్...రేప్ చేస్తారని సోదరికి మెసేజ్:కడపలో కలకలం
కడప:కడపలో ఓ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నగర శివారులోని ఫార్మసీ కాలేజ్ లో చదువుతున్న ఒక విద్యార్థిని తనను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని తన సోదరికి మెసేజ్ పెట్టడంతో ఈ విషయం వెలుగుచూసింది.
తనను ఆటోలో తీసుకెళ్లారని, రేప్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారంటూ సోదరికి ఆ విద్యార్థిని మెసేజ్ పెట్టింది. కిడ్నాప్‌కు గురైన యువతి నిర్మల నర్సింగ్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

అంతేకాకుండా సిసి కెమెరా దృశ్యాలు, మెసేజ్ ఆధారంగా కూడా పోలీసులు విద్యార్థిని ఆచూకి కోసం అన్వేషణ జరుపుతున్నారు. అతి త్వరలోనే విద్యార్థిని ఆచూకి తెలుసుకోగలమని, తల్లదండ్రులు భయపడవద్దని పోలీసులు ధైర్యం చెబుతున్నారు. అయితే విద్యార్థిని కిడ్నాప్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications