మెట్రో రైలు చిత్రాలు: సినీ తారల సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు త్వరలో మెట్రో రైలు రానుంది. మెట్రో రైలు వచ్చేస్తే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. మెట్రోరైల్ నిర్మాణంలో జరుగుతున్న పనులను, నిర్మాణ శైలి తదితర అంశాలను భావి తరాలకు చూపటంతో పాటుగా మెట్రో రైలు పట్ల వారికి అవగాహన కల్పించటమే లక్ష్యంగా మెట్రో క్రానికల్ త్రూ ద లెన్జ్ ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గాడ్గిల్ అన్నారు.
మారియట్ హోటల్‌లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆదివారం సాయంత్రం ఎపిఐఐసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జయేష్ రంజన్ ప్రారంభించారు. కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వివిఎస్ రెడ్డి, సినీ నటులు ప్రగతి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాడ్గిల్ మాట్లాడుతూ - 'మెట్రో నిర్మాణ శైలికు సంబంధించిన ప్రతి చిత్రమూ నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శితమైన చిత్రాలను వరల్డ్ క్లాస్ మెట్రో మ్యూజియంలో ప్రదర్శింపనున్నమని ఆయన చెప్పారు. మెట్రో నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని, ఇప్పటికే మెట్టుగూడ- నాగోల్ మార్గంలో నాలుగు కిలోమీటర్ల ట్రాక్ పూర్తి చేయటంతో పాటుగా నాగోలు డిపోలో 85 శాతం విద్యుదీకరణ పనులు పూర్తి చేశామని వివరించారు. ఏప్రిల్ చివరికి లేదా మే మొదటి వారం నాటికి మూడు బోగీలతో మెట్రో రైలు రానుందని అన్నారు.
మెట్రో ముందు మెట్రో తరువాత అంటూ లండన్ నుంచి మెట్రో ఉన్న నగరాలను క్లాసిఫై చేస్తున్నారని ఎన్‌వివిఎస్ రెడ్డి. అదే రీతిలో హైదరాబాద్ కూడా ఉండనుందని చెప్పారు. ఈ పరిణామ క్రమాన్ని భావి తరాలకు చూపే క్రమంలో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పది మంది ఫొటోగ్రాఫర్లు తీసిన 100 చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నామని చెప్పారు. వారం రోజుల పాటు వీటిని ప్రదర్శించిన తరువాత అత్యుత్తమంగా ఎంపికైన 10 చిత్రాలకు అవార్డులను అందించనున్నామని అన్నారు.

మెట్రో రైలు ఫొటోలు
మెట్రో రైలు పనులు హైదరాబాదులో చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాదులో దానికి సంబంధించిన ఫొటోల ప్రదర్శన ప్రారంభమైంది.

మెట్రో రైలు ఫొటోలు
మారియట్ హోటల్‌లో ప్రారంభమైన మెట్రో రైలు ఫొటోల ప్రదర్శనను ఇలా తిలకించారు. మైట్రో రైలు వస్తే హైదరాబాదు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

మెట్రో రైలు ఫొటోలు
మెట్రో రైలు ఫొటో ప్రదర్శన సందర్భంగా దాని నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్న ప్రముఖులు ఇలా కనిపించారు.

మెట్రో రైలు ఫొటోలు
హైదరాబాదులో ప్రారంభమైన మెట్రో రైలు ప్రదర్శనలో దానికి సంబంధించిన ఫొటో ఇలా కనిపిస్తోంది. వంకలు తిరిగిన మెట్రో రైలు మార్గం ఇది..

మెట్రో రైలు ఫొటోలు
హైదరాబాదులో మెట్రో రైలు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దానికి సంబంధించిన ఓ ఫొటో ఇలా ప్రదర్శనలో కనిపించింది.

మెట్రో రైలు ఫొటోలు
ప్రదర్ననలో పెట్టిన ఓ మెట్రో రైలు ఫొటో ఇలా కనువిందు చేస్తోంది. మెట్రో రైలుకు సంబంధించిన నిర్మాణాలు నీటిలో ప్రతిఫలిస్తూ ఇలా..

మెట్రో రైలు ఫొటోలు
హైదరాబాద్ మెట్రో రైలు ఫొటో ప్రదర్శనలో తారలు సౌమ్య, ప్రగతి కూడా పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమం కూడా రంగులతో నిండిపోయింది.

మెట్రో రైలు ఫొటోలు
హైదరాబాద్ మెట్రో రైలు ఫొటో ప్రదర్శనను ప్రారంభిస్తున్న దృశ్యం. ఈ ప్రదర్శనలో పది మంది తీసిన ఫొటోలున్నాయి.

మెట్రో రైలు ఫొటోలు
మెట్రో రైలు పనుల్లో నిమగ్నమైన ఓ కార్మికుడి ఫొటో గోడకు వేలాడుతుండగా, ఇద్దరు ముద్గుగుమ్మలు ఇలా ముచ్చట్లు పెడుతూ.












Click it and Unblock the Notifications