మీడియాతో జగన్: హావభావాలు ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పూర్తిగా సమైక్యవాదాన్ని భుజాన వేసుకున్నారు. రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాలను, సమైక్యవాదం కోసం తాను చేసే పోరాటాన్ని ప్రకటించేందుకు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన కాంగ్రెసుపై ధ్వజమెత్తడానికి ప్రయత్నించారు.
రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తాను అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. తన పర్యటనకు కోర్టు అనుమతి లభిస్తుందని ఆయన ఆశించారు. సిబిఐ, కాంగ్రెసు పార్టీల మాదిరిగా కాకుండా కోర్టుల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లడానికి, రాష్ట్రంలో పర్యటించడానికి జగన్ కోర్టు అనుమతి పొందారు. అయితే, దేశవ్యాప్తంగా పర్యటించడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే.
జలపంపకాలపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ సమర్పించిన నివేదికపై ఆయన మీడియా సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. మీడియా సమావేశంలో తాను చెప్పినదానికే పరిమితం కావడానికి ఆయన సిద్ధపడ్డారు. మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధపడలేదు. అయితే, రెండు మూడు ప్రశ్నలకు మాత్రం ఆయన అనుమతించారు.

జివోఎంలో నిలదీస్తాం..
రాష్ట్ర విభజన అంశంపై తాను మైసురా రెడ్డి జివోఎంతో భేటీకి పంపిస్తానని ఆయన చెప్పారు. జీవోఎం సమావేశంలో విభజనపై నిలదీయాలని మైసురా రెడ్డికి తాను సూచిస్తానని ఆయన చెప్పారు.

నిమిషాల్లో నిర్ణయం...
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిమిషాల్లో నిర్ణయాలు చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర విభజన జరిగితే తీవ్రమైన నీటి సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు.

దిగ్విజయ్ కాలర్ పట్టుకుని అడగండి...
రాష్ట్ర విభజనపై దిగ్విజయ్ సింగ్ కాలర్ పట్టుకుని అడగాలని జగన్ మీడియా ప్రతినిధులకు సూచించారు. దిగ్విజయ్ సింగ్ ప్రకటనల్లో పొంతన ఉండడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణలోనూ పర్యటిస్తా...
తాను తెలంగాణలోనూ పర్యటిస్తానని, ఈ నెల 26వ తేదీ నుంచి తన పర్యటన ప్రారంభమవుతుందని జనగ్ చెప్పారు.

తిక్కతిక్క ప్రశ్నలు..
మీడియా ప్రతినిధుల నుంచి రెండు ప్రశ్నలు మాత్రమే తీసుకుంటానని చెప్పిన జగన్ ఓ ప్రశ్నకు విసుక్కున్నారు. తిక్క తిక్క ప్రశ్నలు వేస్తూ పోతే వాటికి తాను సమాధానాలు ఇస్తూ పోతే విషయం పక్కదారి పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications