తల్లిని పెళ్లాడి.. కూతుర్ని గర్భవతిని చేశాడు, చిన్న కూతుర్ని.. (పిక్చర్స్)

హైదరాబాద్: వావి వరుసలను మరిచి కళ్లుమూసుకుపోయిన ఓ దుర్మార్గుడు ఓ వితంతువును నమ్మించి పెళ్లి చేసుకొని, ఆమె కూతురుని కూడా చెరబడ్డాడు. కూతురుని లోబరుచుకునేందుకు చిత్రహింసలు పెట్టాడు. ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడు. ఇప్పుడు రెండో కూతురు పైన కూడా కన్నేశాడు. ఆ బాలికలు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ చొరవతో ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మేడ్చల్ పరిధిలో జరిగింది.

కర్నాటకకు చెందిన శశికళ (45) అనే వివాహిత తన భర్త మృతి చెందడంతో నాలుగేళ్ల కిందట ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాదుకు వచ్చింది. మేడ్చల్‌లో ఉంటూ ఓ హోటల్లో పని చేస్తూ తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. ఇద్దరు అమ్మాయిలు మేడ్చల్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. అదే హోటల్లో పని చేస్తున్న కర్నాటకకు చెందిన చంద్ర(35) అనే వ్యక్తి శశిఖలతో సన్నిహితంగా మెలిగేవాడు.

ఆ తర్వాత ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతనిలోని రాక్షసుడు బయటకు వచ్చాడు. శశికళ పెద్ద కూతురు(14)ను చిత్రవధలకు గురి చేసి లోబరుచుకున్నాడు. ఆ బాలికను గర్భవతిని చేశాడు.ఈ క్రమంలో పాఠశాలకు వెళుతున్న బాలిక కూర్చోలేక, నిలబడలేక అవస్థలు పడుతుండటంతో ఉపాధ్యాయులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. దాంతో ఏడు నెలల గర్భవతి అని నిర్ధారణ అయింది.

 అరెస్ట్

అరెస్ట్

విస్తుపోవడం అందరి వంతు అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని పాఠశాలకు పంపించడం మానేశాడు. పెద్ద కూతురు తర్వాత రెండో కూతురు పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లొంగకపోయే సరికి వైరుతో చితకబాదాడు.

 అరెస్ట్

అరెస్ట్

ఒళ్లంతా వాతలతో పాఠశాలకు వెళ్లింది. ప్రిన్సిపల్ వివరాలు అడగటంతో తన తండ్రి కొట్టాడని చెప్పింది. దీంతో ప్రిన్సిపల్ తల్లిదండ్రులను పిలిపించారు. మర్నాడు వచ్చిన తల్లి.. ప్రిన్సిపల్‌కు అబద్దం చెప్పింది. తన తల్లి అబద్దం చెబుతోందని ఆ చిన్నారి ప్రిన్సిపల్‌కు చెప్పింది.

 అరెస్ట్

అరెస్ట్

తన తల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి తన అక్కను, ఇలాగే కొట్టి లోబరుచుకున్నాడని, ఇప్పుడు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఏడ్చింది.

 అరెస్ట్

అరెస్ట్

దీంతో ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా.. నిందితుడు చంద్ర పెద్దమ్మాయితో సన్నిహితంగా ఉండటం చూశారని తెలుస్తోంది. అతడిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+