'ఛానల్లో జాబ్'తో దగా, సెక్స్ రాకెట్లో జూ.ఆర్టిస్ట్(పిక్చర్స్)

హైదరాబాద్: రామంతాపూర్‌లోని దూరదర్శన్ - సప్తగిరి తెలుగులో ప్రోగ్రాం డైరెక్టరుగా పని చేస్తున్నానని, దూరదర్శన్‌లో ఎలాంటి ఉద్యోగాలు కావాలన్నా తన చేతుల్లో పని అని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన నిందితుడిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతీ యువకుల వద్ద రూ.4.48 లక్షలు కాజేశాడు. మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు.

ఏసిపి చెన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా కొమరోల్ మండలం పరిధిలోని పొట్టిపల్లి గ్రామానికి చెందిన బైళ్ల వినోద్ కుమార్ (34) గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్‌సి చదువుకున్నాడు. మార్కాపురం హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 104 క్యాజ్‌వల్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేశాడు. ఉద్యోగం వదిలేసి భార్యాపిల్లలతో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. హబ్సిగూడలో ఉంటూ ఉపాధిలేక విలాసాలకు అలవాటుపడ్డ వినోద్‌కు సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన నిరుద్యోగ యువతీయువకులకు మరీ దగ్గరయ్యాడు.

తాను రామంతాపూర్‌లోని దూరదర్శన్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నానని, తమ సంస్థలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నమ్మబలికాడు. ఆరుగురి వద్ద సుమారు లక్షలు వసూలు చేసి వారు నమ్మేవిధంగా నకిలీ ఫోర్జరీ సంతకాలతో డైరెక్టర్ పేరున స్టాంప్‌లతో కూడిన రాజముద్ర కల్గిన కాల్‌లెటర్లు క్వార్టర్స్ అలాట్‌మెంట్ అయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇతర పత్రాలు ఇంటికి పోస్టు చేశాడు. వచ్చిన కాల్‌లెటర్లతో దూరదర్శన్‌కు వెళ్లిన నిరుద్యోగులు అక్కడికి వెళ్లి జరిగిన మోసాన్ని గుర్తించారు.

దూరదర్సన్

దూరదర్సన్

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఏసిపి చెన్నయ్య నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ కిరణ్ సిబ్బంది ఘరానా మోసగాడైన వినోద్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ల్యాప్‌టాప్, స్టాంప్‌లు స్వాధీనం చేసుకుని మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు.

దూరదర్శన్

దూరదర్శన్

రామంతాపూర్‌లోని దూరదర్శన్ - సప్తగిరి తెలుగులో ప్రోగ్రాం డైరెక్టరుగా పని చేస్తున్నానని, దూరదర్శన్‌లో ఎలాంటి ఉద్యోగాలు కావాలన్నా తన చేతుల్లో పని అని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన నిందితుడిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు.

దూరదర్శన్

దూరదర్శన్

వినోద్ కుమార్‌ది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, పొట్టిపల్లి. గతంలో 104లో మార్కాపురంలో పని చేసి తక్కువ జీతం వస్తుందని మానేశాడు. అనంతరం సులువుగా డబ్బులు సంపాదించాలనే కోరికతో మోసాలకు తెగబడ్డాడు.

దూరదర్శన్

దూరదర్శన్

2010లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేయడంతో సైదాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 2012లో ఇదే తరహాలో గిద్దలూరులోను మోసం చేయడంతో కేసు నమోదయింది. దీంతో హైదరాబాదుకు మకాం మార్చాడు.

దూరదర్శన్

దూరదర్శన్

నిరుద్యోగులను ఎంపిక చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేడమే వినోద్ విధిగా పెట్టుకున్నాడు. నగరంలోని హబ్సిగూడలో ఉంటూ దూరదర్శన్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేశాడు.

దూరదర్శన్

దూరదర్శన్

అందుకు కావాల్సిన ఐడి కార్డులు, కాల్ లెటర్లు తయారుకు ల్యాప్‌ల్యాప్, ట్యాబ్, సెల్‌ఫోన్ కొన్నాడు. వీటితో పాటు అదికారిక పత్రాల కోసం రబ్బరు స్టాంపులను తయారు చేయించాడు.

దూరదర్శన్

దూరదర్శన్

మొదట విడతగా ఆరుగురిని ఆకర్షించాడు. వీరి నుండి రూ.4.48 లక్షలు వసూలు చేశాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా ఐడి కార్డులను, కాల్ లెటర్లను తయారు చేసి వారికి ఇచ్చాడు.

దూరదర్సన్

దూరదర్సన్

ఆర్డరు కాపీలో ఉద్యోగంలో చేరాల్సిన తేది, జీతం, ఇతర వివరాలను కూడా పొందుపర్చాడు. వాటితో ఉద్యోగంలో చేరేందుకు రామంతాపూర్‌లోని దూరదర్శన్‌కు వచ్చిన ఉద్యోగులకు చుక్కెదురైంది.

జూనియర్ ఆర్టిస్ట్

జూనియర్ ఆర్టిస్ట్

హైటెక్ వ్యభిచార గుట్టును ఎస్ఓటి పోలీసులు రట్టు చేశారు. జూనియర్ ఆర్టిస్టుతో పాటు నిర్వాహకురాలు, విటులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్ భరత్ నగర్‌లోని ఓ అపార్టుమెంటులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందటంతో మంగళవారం దాడి చేశారు.

జూనియర్ ఆర్టిస్ట్

జూనియర్ ఆర్టిస్ట్

విశాఖలోని అల్లిపురానికి చెందిన జూనియర్ అర్టిస్టుతో పాటు విటులు అంబరుపేటకు చెందిన రవి, రాజ్కుమార్‌లను పట్టుకున్నారు. విశాఖకు చెందిన శరణ్య అపార్టుమెంటులోని ఓ ప్లాటును అద్దెకు తీసుకొని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జూనియర్ ఆర్టిస్టు అయిన యువతికి ఐదు రోజులకు గాను రూ.25 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. సదరు యువతి పలు చిత్రాలలో జూనియర్ ఆర్టిస్టుగా నటించినట్లు తెలిపారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+