రాజధాని 'భూమి'పై తర్జన: బాబు రివ్యూ(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషంలో తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ సమీపంలో రాజధాని ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం.. ఇక పైన ఎలా ముందుకెళ్లాలి? ప్రభుత్వ భూముల లభ్యత ఎంత? రైతుల నుండి సేకరించాల్సిన భూములు ఎంత ఉంటుంది? తదితర అంశాల పైన దృష్టి సారించింది.
ప్రభుత్వం నియమించిన రాజధాని భూసేకర కమిటీలోని రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినిని ఉమామహేశ్వర రావులు శనివారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాజధానికి భూసేకరణ అంశంపై ఏ విధానంతో ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు.
ప్రభుత్వ భూమి ఎక్కడ అందుబాటులో ఉంది? ప్రయివేటు భూమిని ఎంత సేకరించాల్సి ఉంటుంది? రైతుల అభిప్రాయం ఏమిటి? తదితర అంశాలపై దృష్టి సారించారు. రైతుల నుండి భూమిని సేకరించడం పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. దీనికిప్రతిగా రైతులకు అభివృద్ధి చేసిన భూమిలో 40 శాతం వాటా ఇవ్వడంతో పాటు, ఇతర రాయితీలు కూడా కల్పించేలా చూడాలని పేర్కొన్నారని తెలిస్తోంది.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో విద్య తదితర అంశాల పైన సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో విద్య తదితర అంశాల పైన సమీక్ష నిర్వహించారు.

రాజధాని పై సమీక్ష
అభివృద్ధి చేసిన భూమిలో వారికి ఇచ్చే వాటాను రాజధాని పక్కనున్న ఏ ప్రాంతంలో ఇవ్వాలి? తదితర అంశంలన్నింటి పైన సమగ్రంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఎకరా భూమిని అభివృద్ధి చేస్తే రోడ్లు, ఇతర సౌకర్యాలు పోను ఎంత భూమి మిగులుతుందన్న దాని పైన చర్చించారు.

రాజధాని పై సమీక్ష
గుంటూరు - విజయవాడల మధ్య ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ఇతర ప్రాంతాల్లో ఎంత ఉంది? తదితర అంశాల పైన సమీక్షించారని తెలుస్తోంది. భూసేకరణ ప్రక్రియ పైన కసరత్తును క్రమంగా వేగవంతం చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు, మంత్రులు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. నెల రోజుల లోపు రాజధాని పైన మరింత స్పష్టమైన చిత్రం వస్తుందని మంత్రుల కమిటీ అంచనా వేస్తోంది. త్వరలో మరోసారి భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications