దేవినేని వార్న్:హరీష్‌ని కూర్చోబెట్టి, శోభా బిజీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇవ్వడంతో సోమవారం అసెంబ్లీ ప్రాంగణం రోజటి కంటే హాట్ హాట్‌గా కనిపించింది. కిరణ్ ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని శాసన సభలో సభాపతిని, మండలిలో చైర్మన్‌ను తెలంగాణ ప్రాంత సభ్యులు డిమాండ్ చేశారు.
జై తెలంగాణ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు స్పందించారు. దీంతో శాసన సభ, శాసన మండలి మంగళవారానికి వాయిదా పడింది. కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలంగాణ టిడిపి, తెరాస, బిజెపి ఇతర నేతలు మండిపడ్డారు.
మరోవైపు విభజన బిల్లును తిప్పి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైనదేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పల్లం రాజు సమర్ధించారు. సోమవారం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ బిల్లులో లోపాలు ఉన్నాయని ఇది వరకే హైకమాండ్‌కు చెప్పామని, అయినా వారు పట్టించుకోలేదని అన్నారు. పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బిల్లుకు సంబంధించిన అంశాలపై రాష్ట్రపతి నుంచి వచ్చిన తర్వాతే స్పందిస్తానన్నారు.

అసెంబ్లీ
తెలంగాణ ముసాయిదా బిల్లును వెనక్కి పంపించాలని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యం ముసుగులో విభజనకు సహకరిస్తోందని సీమాంధ్ర టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.

హరీష్‌తో టిటిడిపి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత దయాకర్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు మాట్లాడుతున్న దృశ్యం.

హరీష్‌తో టి కాంగ్రెస్
అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలతో తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు మాట్లాడుతున్న దృశ్యం.

కోమటిరెడ్డి
అసెంబ్లీ ప్రాంగణంలో నమస్తే తెలంగాణ పత్రిక చదవుతూ మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

టిడిపి అండ్ కాంగ్రెస్
అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడి వెళ్లిపోతుండగా తెలంగాణ కాంగ్రెసు నేతలు వస్తున్న దృశ్యం.

శోభా నాగి రెడ్డి
అసెంబ్లీ ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి, ఇతర నేతలు ఉన్న దృశ్యం.

జెపి
అసెంబ్లీ ప్రాంగణంలో లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ సోమవారం మధ్యాహ్నం మాట్లాడుతూ...

గుండా మల్లేష్
అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద సోమవారం దిన పత్రికలో వచ్చిన తెలంగాణ కోసం ఆత్మహత్య వార్త చూపిస్తున్న లెఫ్ట్ పార్టీ సభ్యులు

చంద్రబాబు
టిడిఎల్పీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఇరు ప్రాంతాల ఆ పార్టీ నాయకులు.












Click it and Unblock the Notifications