బాబు-మోడీ, తెరాస ఫ్లెక్సీ: బాధ్యత కాదని.. (పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీ కూటమి సవాల్‌గా తీసుకుంటున్నాయి.
తమ తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ-టీడీపీ కూటమి, టీఆర్ఎస్, కాంగ్రెసు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా తెరాస, బీజేపీ-టీడీపీ కూటమి మధ్యే పోటీ నెలకొంది.
బీజేపీ-టీడీపీ కూటమి నుండి జగ్గారెడ్డి, తెరాస నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి సునితా లక్ష్మా రెడ్డిలు బరిలో ఉన్నారు.

కారు, కమలం
మెదక్ ఉప ఎన్నికల్లో తెరాస, బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. ఇరు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాగా, మెదక్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున ప్రచారం కోసం వెళ్తున్న ఓ వాహనం. ఈ వాహనం పైన మోడీ, చంద్రబాబు, జగ్గారెడ్డిల ఫోటోలు ఉన్నాయి. దాని వెనుక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్వాగతం పలుకుతున్న హోర్డింగ్ ఉన్న దృశ్యం.

రామ మందిరం
అయోధ్యలో రామ మందిర నిర్మాణ బాధ్యత బీజేపీది కాదని, ప్రస్తుతం మందిర నిర్మాణం అంత ముఖ్యమైనదేమీ కాదని, రామందిర నిర్మాణానికి ఆటంకాలు ఎదురు కాకుండా చూస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ ప్రకాష్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

మురళీధర రావు
కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై గతంలో పార్టీ నిర్ణయాలు తీసుకుందన్నారు. నిర్దేశిత ప్రణాళికతో బీజేపీ ముందుకెళుతోందని, ఈ మూడు కార్యక్రమాలూ అందులో భాగమేనన్నారు. అయితే రామ మందిరాన్ని బీజేపీ నిర్మించదని, నిర్మాణం పట్ల ప్రజల్లో ఉండే అపోహలు తొలగించడంతో పాటు నిర్మాణానికి ఆటంకాలు ఎదురుకాకుండా చూసే వరకు మాత్రమే తాము పరిమితమన్నారు.

మురళీధర రావు
కేంద్రం, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో తెలంగాణ సర్కారు, కేంద్రంతో సరైనరీతిలో సంప్రదింపులు జరపడం లేదన్నారు. ప్రజలు ఆశించిన మేర ప్రభుత్వం పని చేయడం లేదన్నారు. విద్యుత్తు సరఫరాలో తమను సంప్రదించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదంటూ సాక్షాత్తు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు ఇప్పటికీ స్థల కేటాయింపుపై స్పందించిన దాఖలా లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామన్నారు.












Click it and Unblock the Notifications