కూతురుకి సినిమా, కొడుక్కి ఐటి: బాబు హావభావాలు

హైదరాబాద్: రాష్ట్ర పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. తెలంగాణ ప్రాంత పార్టీ నేతలతో నిర్వహించిన మేధో మథన సదస్సు ముగింపు కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో కుప్పకూలిందని ఆరోపించారు. రాష్ట్రం అన్నింటా వెనుకబడిందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం టిడిపితోనే సాధ్యం.

టిడిపి వస్తేనే రాష్ట్రం గాడిలో పడుతుందని, అలా చేసి చూపించిన చరిత్ర పార్టీదన్నారు. అధికారంలోకి వస్తామని, పునర్నిర్మాణం చేసి చూపిస్తామన్నారు. పార్టీ దక్షత ఏమిటో ఉత్తరాఖండ్ వరదల్లో చూపామని, తమ పార్టీతోనే భవిష్యత్తు బాగుంటుందన్న భరోసా ప్రజలకు ఇవ్వగలిగితే వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మన గెలుపు చారిత్రక అవసరమని, మన కోసం, మన పార్టీ నేతల కోసం అడగడం లేదని, ఈ రాష్టం కోసం అడుగుతున్నామన్నారు.

స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుదామనుకొన్న రాష్ట్రాన్ని అవినీతి ప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా సింగపూర్‌లో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి వెళ్లి రోడ్లు ఎలా శుభ్రం చేస్తారో చూసి, హైదరాబాద్‌లో దాన్ని అమలు చేశానని, ప్రతిరోజూ రాష్ట్రానికి ప్రాజెక్టులు తెప్పించేందుకు ప్రయత్నాలు చేసేవాడినన్నారు. విభజనపై సొంత పార్టీలో ఏకాభిప్రాయం సాధించలేని కాంగ్రెస్ ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తుందని విస్మయం వ్యక్తం చేశారు.

బాబు 1

బాబు 1

విభజనపై టిడిపిలో రెండు ప్రాంతాల నేతలతో అనేకసార్లు చర్చించామని, అలాంటి ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదని, కాంగ్రెస్‌లో ఒక్కో నేతది ఒక్కో మాట అని, ఒక్కో కమిటీది ఒక్కో నివేదిక అని బాబు మండిపడ్డారు.

బాబు 2

బాబు 2

రాజకీయ లాభం చూసుకోవడం తప్ప ప్రజలపట్ల బాధ్యత లేకుండా కాంగ్రెసు వ్యవహరిస్తోందని, రెండు వైపులా ఐకాసలు, ప్రభావిత వర్గాలవారితో మాట్లాడి ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరించమంటే ఎందుకు చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.

బాబు 3

బాబు 3

గతంలో కేంద్రంలో మూడు కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు కారణమైన టిడిపి మరోసారి చక్రం తిప్పబోతోందని, టిడిపి ప్రజల కోసం పోరాడుతుంటే తెరాస బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని బాబు ధ్వజమెత్తారు.

బాబు 4

బాబు 4

టికెట్లు అమ్ముకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్ర సమితిది అని, అసాధ్యపు హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు 5

బాబు 5

కెసిఆర్ ఇంట్లో కూతురుకు సినిమా, కొడుక్కు ఐటి, అల్లుడికి విద్యారంగం అప్పచెప్పి అయినకాడికి దండుకున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

బాబు 6

బాబు 6

సమర్థ నాయకత్వం, సుపరిపాలన, నైతిక రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఈ నెల 15వ తేది నుంచి ఇంటింటికీ టిడిపి పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని బాబు సూచించారు.

బాబు 7

బాబు 7

రాష్ట్ర పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+