ముద్దుల బాబుతో అసెంబ్లీకి చంద్రావతి, ఉద్రిక్తం(పిక్చర్స్)
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల తీరు మారలేదు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు పట్టుబట్టగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు నినాదాలు చేశారు. శాసన సభ, మండలి బిల్లు రగడతో గురువారానికి వాయిదాపడ్డాయి.
సోమవారం అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టినప్పటి నుండి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడుతున్నాయి. తెలంగాణ బిల్లుపై చర్చ నేపథ్యంలో సీమాంధ్ర విద్యార్థి సంఘాలు బుధవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇటీవల పెళ్లి చేసుకున్న సిపిఐ ఖమ్మం జిల్లా శాసన సభ్యురాలు చంద్రావతి అసెంబ్లీకి ఈ రోజు తన చిన్నారిని తీసుకు వచ్చారు. చిన్నారని పలువురు ముద్దులతో ముంచెత్తారు. చంద్రావతికి ఐదు నెలల కిందట మహిళా శాసన సభ్యులు సీమంతం చేశారు. ఇప్పుడు ఆమె అసెంబ్లీకి చిన్నారిని తీసుకు వచ్చి అందరినీ ఆనందంలో ముంచెత్తారు.

తెరాస
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు.

చంద్రావతి 1
ఖమ్మం జిల్లా సిపిఐ శాసన సభ్యురాలు బానోతు చంద్రావతి తన కూతురును అసెంబ్లీకి తీసుకు వచ్చిన దృశ్యం. ఆమె కొంతకాలం క్రితం వివాహం చేసుకున్నారు.

చంద్రావతి 2
ఖమ్మం జిల్లా సిపిఐ శాసన సభ్యురాలు బానోతు చంద్రావతి తన కూతురును అసెంబ్లీకి తీసుకు వచ్చిన దృశ్యం. ఆమె కొంతకాలం క్రితం వివాహం చేసుకున్నారు. బిడ్డను చూస్తూ..

చంద్రావతి 3
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద సిపిఐ శాసన సభ్యులు గూండా మల్లేష్ సహచర సభ్యురాలు చంద్రావతితో కలిసి మాట్లాడుతున్న దృశ్యం.

తెరాస
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్ష నేత ఈటెల రాజేందర్. బిల్లుపై చర్చను సీమాంధ్ర నేతలు అడ్డుకోవద్దని కోరారు.

హరీష్
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు, పక్కన ఘనపురం ఎమ్మెల్యే రాజయ్య

జెపి
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ.

శంకర రావు
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యులు శంకర రావు, అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహాన్ని త్వరగా పెట్టాలని డిమాండ్ చేశారు.

ఎర్రబెల్లి
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు దృశ్యం.

పయ్యావుల
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద సభాపతికి సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను చూపిస్తున్న పయ్యావుల కేశవ్.

పోచారం
అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్న తెరాస ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు.

ఆందోళన 1
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టి చర్చకు సిద్దమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత విద్యార్థి సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.

ఆందోళన 2
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టి చర్చకు సిద్దమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత విద్యార్థి సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాలు చేశారు.

ఆందోళన 3
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టి చర్చకు సిద్దమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత విద్యార్థి సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఆందోళన 4
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టి చర్చకు సిద్దమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత విద్యార్థి సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాలు చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

ఆందోళన 5
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టి చర్చకు సిద్దమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత విద్యార్థి సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.

దామోదర
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం మధ్యాహ్నం శాసన మండలికి వచ్చారు. అనంతరం ఆయన బయటకు వస్తున్న దృశ్యం.

నన్నపనేని
శాసన మండలి వాయిదా పడిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి.

పార్థసారథి
మంత్రి పార్థసారథి బుధవారం మధ్యాహ్నం శాసన మండలికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా హాజరయ్యారు.

స్వామి గౌడ్
శాసన మండలి వాయిదా పడిన అనంతరం బయటకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు స్వామి గౌడ్, సుధాకర్ రెడ్డి తదితరులు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్












Click it and Unblock the Notifications