నాగ్: ఓ మంచి ఫ్రెండ్! బిజెపియే పరిష్కారం!! (పిక్చర్స్)

హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని అహ్మదాబాద్ వెళ్లి యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కలుసుకోవడం రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.

నరేంద్ర మోడీని నాగార్జున కలుసుకోవడంపై వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపి అధికారంలోకి వస్తుందని గట్టిగా భావించినందువల్ల తన ప్రాపర్టీస్ కోసం, తన వ్యాపార భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన వ్యాపార భాగస్వామి వైయస్ జగన్‌లను గట్టెక్కించేందుకేననే విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే, అక్కినేని కుటుంబం.. ముఖ్యంగా నాగార్జున అందరికి... రాజకీయాలకు అతీతంగా మంచి స్నేహితుడని చెబుతున్నారు. అందరితోను సన్నిహితంగా ఉంటారంటున్నారు. అయితే, ఆ సాన్నిహిత్యం వెనుక కూడా ఏదో ఉంటుందనే వాదనలు కూడా లేకపోలేదు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అక్కినేని నాగార్జున బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రెండు రోజుల క్రితం కలిశారు. గుజరాత్‌ను మోడీ బాగా అభివృద్ధి చేశారని, ప్రధాని అయితే దేశమంతా ఇదే తరహా అభివృద్ధి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

అక్కినేని నాగేశ్వర రావు

అక్కినేని నాగేశ్వర రావు

అక్కినేని కుటుంబ సభ్యులు సహజంగా అందరితోను... రాజకీయాలకతీతంగా సన్నిహితంగా ఉంటారని అంటారు. ఎఎన్నార్... ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డిలతో సన్నిహితంగా ఉండేవారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... అక్కినేని నాగార్జున జన్మభూమి కార్యక్రమాలకు మద్దతు పలికారు.

 వైయస్ రాజశేఖర రెడ్డి

వైయస్ రాజశేఖర రెడ్డి

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితోను అక్కినేని కుటుంబ సభ్యులు సన్నిహితంగా ఉండేవారు. వైయస్ హయాంలో నాగార్జున కొన్ని యాడ్స్‌లలోను ప్రభుత్వానికి మద్దతుగా కనిపించారు. వైయస్ మృతి తర్వాత జగన్‌తోను సన్నిహితంగా మెలిగారు. నిమ్మగడ్డ ప్రసాద్ జైలులో ఉన్నప్పుడు వెళ్లి పలుమార్లు కలిశారు.

 కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగార్జున వెళ్లి ఆయనను కలిసిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా అక్కినేని కుటుంబం కాంగ్రెసు మద్దతుదారులుగా ఉంటున్నారు.

నాగార్జున

నాగార్జున

కాగా, మోడీని నాగార్జున వ్యూహాత్మకంగా కలిసి ఉంటారని అంటున్నారు. మోడీతో భేటీ... నాగ్ సేఫ్ కార్డును ఉపయోగించడమే అంటున్నారు. తెరాస లేదా కాంగ్రెసు పార్టీని సమర్థిస్తే... సీమాంధ్రలో సినీ పరిశ్రమకు ఇబ్బందులు వస్తాయని, మిగతా పార్టీలను కలిస్తే... తెలంగాణలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అన్నింటికి బిజెపి ఒక్కటే పరిష్కారమని, అదీ కాకుండా బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ పరిశ్రమ భావిస్తోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+